Reading Time: 2 minutes

Ram Charan: మీ ప్రయాణం మాకు ఎప్పటికీ స్పూర్తిదాయకం.. తండ్రి 48 ఏళ్ల సినీ ప్రస్థానంపై రామ్ చరణ్ ఎమోషనల్!.

Caption of Image.

టాలీవుడ్ బాక్సాఫీస్ ఏకఛత్రాధిపతి, స్వయంకృషితో ‘మెగాస్టార్’గా ఎదిగిన చిరంజీవి సినీ పయనానికి 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ ప్రయాణం ఐదు పదుల దిశగా దూసుకెళ్తోంది. ‘ప్రాణం ఖరీదు’, ‘పునాదిరాళ్లు’చిత్రాలతో మొదలైన ఆయన ప్రస్థానం.. ‘ఖైదీ’తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. డ్యాన్సులు, ఫైట్లు, నటనతో తెలుగు సినిమా గమనాన్నే మార్చేసింది. పద్మవిభూషణ్ వరకు పొందిన అరుదైన గౌరవాలు ఆయన సొంతం.

ఈ మైలురాయిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో పాటు కోట్లాది మంది అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నాకు లభించిన అవార్డుల కంటే, అభిమానులు వారి హృదయాల్లో ఇచ్చిన స్థానమే అత్యంత విలువైనది. చిరంజీవి అనే పేరుకు మీరు ఇచ్చిన గుర్తింపు శాశ్వతమైనది’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. “48 ఏళ్ల క్రితం మీరు వేసిన మొదటి అడుగు మన కుటుంబంతో పాటు తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేసింది నాన్నా. మీ ప్రయాణం నాకు, రాబోయే తరాలకు ఎప్పటికీ స్పూర్తిదాయకం. మీరు 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకునే ఆ మహోత్సవం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

 

ప్రస్తుతం 71 ఏళ్ల వయసులోనూ నవయువకుడిలా చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘విశ్వంభర’ (Vishwambhara) నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీంతో పాటు కె. సత్యం, కదిరి కాళిదాస్ దర్శకత్వంలో ‘కాక’, దాసరి శ్రీకాంత్ ఒడేలా కాంబినేషన్‌లో భారీ యాక్షన్ డ్రామా లైన్‌లో ఉన్నాయి. చరణ్ సైతం ‘పెద్ది’ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో సత్తా చాటుతున్నారు. తన సినీ పయనానికి అర శతాబ్దానికి చేరువవుతున్న మెగాస్టార్ కు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.