Reading Time: < 1 minute

నిస్వార్థ ప్రజాసేవకు దీన్‌‌దయాళ్ ప్రతీక : బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్‌‌ రెడ్డి

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: సమాజంలో అట్టడుగున ఉన్న చివరి వ్యక్తి సంక్షేమమే ధ్యేయంగా పండిట్ దీన్‌‌దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతం ఎప్పటికీ ప్రజా జీవితానికి దిక్సూచిగా నిలుస్తుందని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌‌రెడ్డి అన్నారు. శుక్రవారం పండిట్ దీన్‌‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని  తన నివాసంలో దీన్‌‌దయాళ్ ఫొటోకు కర్నాటక బీజేపీ నేత జి.లల్లేశ్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

సుధాకర్‌‌రెడ్డి మాట్లాడుతూ.. దీన్‌‌దయాళ్ అందించిన బోధనలు, సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం ప్రతి పౌరుడి సంక్షేమం, ఆత్మగౌరవమే దేశాభివృద్ధికి కేంద్రబిందువని చాటిచెప్పిందన్నారు. దేశ పటిష్టత, నిస్వార్థ ప్రజాసేవ, సామాజిక సామరస్యం కోసం దీన్‌‌దయాళ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, బీజేపీ స్టేట్ ఆఫీసులోనూ దీన్ దయాళ్ జయంతి నిర్వహించారు. 

©️ VIL Media Pvt Ltd.