Reading Time: 2 minutes

SIRపై ఈసీలోనే విభేదాలు..13కోట్ల ఓటర్ల తొలగింపుపై పెరుగుతున్న అనుమానాలు

Caption of Image.

కేంద్ర ఎన్నికల సంఘం మునుపెన్నడూ లేని విధంగా విమర్శల పాలవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ( SIR) ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు జరగడం, దీనిపై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కమిషనర్లలో తీవ్ర అంతర్గత విభేదాలు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎవరు ఓటు వేయాలి, ఎవరు వేయకూడదు అని నిర్ణయించడంలో ఎన్నికల సంఘం పాత్రపై చర్చకు దారి తీసింది. 

దేశవ్యాప్తంగా SIR ప్రక్రియలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు రిపోర్టులో తెలిపింది.

ముఖ్యంగా ఓటర్ల డేటాబేస్‌ను ఢిల్లీ కేంద్రంగా నడిపించారని కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6లో మార్పులు చేయడం వంటి అంశాలపై ఇద్దరు కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఫారం-6లో చేసిన మార్పులు అనుమతి లేకుండా జరిగాయని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

ముఖ్యంగా ఓటర్ల డేటాబేస్‌ను ఢిల్లీ కేంద్రంగా నడిపించారని కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6లో మార్పులు చేయడం వంటి అంశాలపై ఇద్దరు కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఫారం-6లో చేసిన మార్పులు అనుమతి లేకుండా జరిగాయని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

ఈ పరిణామాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.  ఇది ఓటు దొంగతనం చేయడమే, రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని, బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ , ఈసీ కలిసి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 

కపిల్ సిబల్ కూడా సర్ పేరుతో కోట్లాది ప్రజల ఓట్లను తొలగించడంపై ఈసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం (ECI) ఐటీ వ్యవస్థ కేంద్రీకరణపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తప్పుగా తొలగించారు దానికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ECI ఐటీ వ్యవస్థ కేంద్రీకరణ, ఫారం-6 మార్పులపై ప్రశ్నలు లేవనెత్తారు.

మరో వైపు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వచ్చిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు అవసరమని కోరారు. కేటీఆర్ సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సూచించారు. 

ఈసీలోనే విభేదాలు బయటపడటంతో SIR ప్రక్రియపై పారదర్శకత, ఓటర్ల హక్కులపై చర్చ మరింత పెరిగింది.

©️ VIL Media Pvt Ltd.