
రాంచీ: ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు, ఇష్టానుసారం మాట్లాడినప్పుడు కల్లు తాగిన కోతిలా చిందులేస్తున్నాడని అంటుంటారు. కానీ.. ఈ కోతి మాత్రం కల్లు కాదు క్వార్టర్ తాగి పండుకుంది. రాంచీలోని ఓర్మాంఝీ బ్లాక్ చౌక్ దగ్గర ఉన్న వైన్స్లో దూరిన కోతి ఇలా తాగి పడుకోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
VERY UNUSUAL! A monkey entered a wine 🍷shop in Ranchi’s Ormanjhi, allegedly drank alcohol from a bottle and then fell asleep inside the shop 😴
A rescue team arrived and safely removed the unexpected customer. 🐒 pic.twitter.com/Z6xs3vVNGb
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 26, 2026
ఈ ఆడ కోతి మద్యం దుకాణంలోకి ప్రవేశించి, ఒక సీసాలోని మద్యం తీసుకుని తాగి.. ఆ తర్వాత అక్కడే నిద్రపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫుల్లుగా మందేసి కోతి హాయిగా గాఢ నిద్రలోకి జారుకుంది. ఎంత నిద్ర లేపినా లేవకపోవడంతో వైన్స్ సిబ్బంది కోతిని అలానే వదిలేసి వ్యాపారం చేసుకున్నారు. కొన్ని గంటలు నిద్రపోయిన తర్వాత కోతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.