Reading Time: < 1 minute

బెల్లంపల్లి: ఆరుగురు దొంగల అరెస్టు

Caption of Image.

బెల్లంపల్లి, వెలుగు: తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బెల్లంపల్లి ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ దేవయ్య వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బి.నీలేశ్‌‌‌‌, దూల రాజేశం, మీసాల భిక్షపతి, దూల నవీన్​, ఈగం రాజేశం, రెబ్బెన శ్రీకాంత్​ గ్రూపుగా ఏర్పడ్డారు. 

తాండూర్, భీమిని, బెల్లంపల్లి, నెన్నెల్, తాళ్లగురిజాల, తిర్యాని, రెబ్బెన పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుళ్లు టి.రాజేశ్వర్, ఎం.రాము , వి.తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు ఎం.విజయ్ కుమార్, బి.తిరుపతిని ఏసీపీ అభినందించి క్యాష్ రివార్డ్ అందజేశారు.

©️ VIL Media Pvt Ltd.