
- ప్రొఫెసర్ సూర్యనారాయణను సెలవుపై పంపించిన యంత్రాంగం
ముంబై: ఐఐటీ బాంబే బీటెక్ సెకండియర్ స్టూడెంట్ సాహిల్ వాకొడే సూసైడ్‌పై విచారణకు ఆ సంస్థ యంత్రాంగం 10 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కుల వివక్ష, ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లపై వేటువేసింది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డీన్ బాధ్యతల నుంచి తప్పించింది.
విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు ఆయనను సెలవుపై పంపించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సాహిల్ మృతిపై ఏర్పాటైన కమిటీ త్వరలోనే ఆయన్ను విచారించే అవకాశముందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సాహిల్ కుల వివక్షాపూరిత దూషణలను ఎదుర్కొన్నాడని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారే, సూర్యనారాయణ దూళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 18న మిడ్ సెమిస్టర్ పరీక్షలో చాట్ జీపీటీ ఉపయోగిస్తూ దొరికిన కొద్దిగంటలకే సాహిల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాలను పరిశీలిస్తూ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.