Reading Time: 2 minutes

జెన్ జీల ఓట్లను అడ్డుకున్నారు..ముమ్మాటికీ మోదీ, సీఈసీ కుట్ర: కాంగ్రెస్

Caption of Image.

18 ఏళ్లు నిండిన కొత్త తరం జెన్ జీ(Gen Z) లను ఓటర్లుగా నమోదు కాకుండా పెద్ద కుట్ర జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సర్ పేరుతో ఎలక్షన్ కమిషన్ చీఫ్, మోదీ కలిసి కుట్ర చేసి లక్షలాది మంది యువత ఓటు హక్కును కోల్పోయేలా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టులో చెప్పినట్లు ప్రతియేటా నిర్వహించే SSR ప్రక్రియను నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, ఉద్దేశపూర్వకంగా మోదీ, సీఈసీ కుమ్మక్కై జెన్ జీల ఓట్లను అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.  

2024 నుంచి ఉద్దేశ పూర్వకంగానే ప్రతిఏటా నిర్వహించాల్సిన స్పెషల్ సమ్మరీ రివిజన్(SSR) నిలిపివేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిఏటా  మేనెలలో ప్రారంభం కావాల్సిన SSR ప్రక్రియ ఇప్పటివరకు నిర్వహించకపోవడం కుట్ర అన్నారు. ప్రధానిమోదీ ప్రభుత్వాన్ని  ఎండగడుతున్న యువత అంటే ప్రధాని మోదీకి భయమని అందుకే వారిని ఓట్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. SSR ను కొనసాగించాలని ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లతో స్పష్టంగా  చెప్పినప్పటికీ సీఈసీ జ్ణానేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రక్రియను నిలిపివేశారని అన్నారు. 

గత పది నెలల్లో ఎన్నికల సంఘం తీసుకున్న వివిధ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు 14 సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ జరిపిన విచారణలో వెల్లడైన క్రమంలో ఈ తాజా విషయం వెలుగు చూసింది. 

 స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) అంటే..

SSR అనేది SIR  కు భిన్నంగా ఓటర్ల జాబితాను అప్డేట్ చేసే కీలకమైన ప్రక్రియ. కొత్తగా అర్హత పొందిన ఓటర్లను చేర్చడానికి చేపట్టే వార్షిక ప్రక్రియ.18 ఏళ్లు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడానికి SSR చాలా కీలకమైన విధానం. 

ఈ ప్రక్రియలో ప్రతి ఏటా18 ఏళ్లు నిండిన వారికి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 , అక్టోబర్ 1 తేదీలలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ ను పరిశీలిస్తే ..చివరి SSR ప్రక్రియ 2024లో జరిగినట్లు తెలుస్తోంది. 2025లో బీహార్‌లో SIR ప్రక్రియను చేపట్టారు..ఆ తర్వాత దీనిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించారు. దీంతో  ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950’లోని సెక్షన్ 21 ప్రకారం రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న వార్షిక SSR ప్రక్రియకు నిర్వహించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు ప్రకారం.. కొనసాగుతున్న SIR ప్రక్రియ మధ్యలో SSR అవసరమా అనే విషయంపై CEC జ్ఞానేష్ కుమార్ న్యాయ సలహా కూడా కోరారు. అయితే, సంధూ ,జోషీలు SSR ప్రక్రియను బలంగా సమర్థించడంతో పాటు దానిని తిరిగి ప్రారంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతిఏటా 18 ఏళ్లు నిండే వారిని ఓటర్ల జాబితాలో చేర్చడం అవసరమని ఆ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు బల్లగుద్ది మరీ చెప్పారు. అయినా జ్ణానేష్ కుమార్ ఈ విషయాన్ని పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.