Reading Time: < 1 minute

ఒక్క టీమ్ కు రూ.107 కోట్లు.. ప్రముఖ టీ20 లీగ్లోకి 9వ ఫ్రాంఛైజీ

Caption of Image.

 ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తన ఫ్లాగ్‌షిప్ టీ20 ముంబై లీగ్‌ను విస్తరిస్తూ పోతోంది. లేటెస్టుగా లీగ్ లోకి తొమ్మిదో ఫ్రాంచైజీ వచ్చి చేరింది.  ఈ కొత్త జట్టు నవీ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఫ్రాంచైజీ ఆపరేటింగ్ రైట్స్‌ను ఆస్పెక్ట్స్ స్పోర్ట్స్‌కు ఆరేళ్ల కాలానికి 106 కోట్ల 88లక్షలకు ఇచ్చారు. మొదటి సీజన్‌కు 12 కోట్లు 21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విస్తరణతో లీగ్ పరిధి మరింత పెరిగింది. నవీ ముంబై నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు పోటీలోకి రావడంతోపాటు,   టాలెంట్‌కు మెరుగైన వేదిక లభిస్తుందని ఎంసీఏ పేర్కొంది.

ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్య నాయక్ మాట్లాడుతూ, టీ20 ముంబై లీగ్‌ను నవీ ముంబైకి విస్తరించడం. ముంబై క్రికెట్ ఎకోసిస్టమ్‌లోని ప్రతి మూలకు ఆటను తీసుకెళ్లాలన్న మా విజన్‌లో ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది. తొమ్మిదో ఫ్రాంచైజీ జోడించడం వల్ల లీగ్ రీచ్ పెరుగుతుంది. అలాగే ఎమర్జింగ్ క్రికెటర్లకు  తమ టాలెంట్ ప్రదర్శించే అవకాశాలు పెరుగుతాయి. ఆస్పెక్ట్స్ స్పోర్ట్స్‌ను స్వాగతిస్తున్నాం. లీగ్‌ను మరింత బలోపేతం చేసి తదుపరి తరం టాలెంట్‌ను పెంపొందించేందుకు కలిసి పని చేస్తాం అని అన్నారు.

టీ20 ముంబై లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజ్‌దీప్ గుప్తా మాట్లాడుతూ తొమ్మిదో ఫ్రాంచైజీ జోడించడం లీగ్ అభివృద్ధిలో కొత్త అధ్యాయం. ఫ్రాంచైజీ బేస్ విస్తరించడం వల్ల మరింత బలమైన, సస్టైనబుల్ ఎకోసిస్టమ్ నిర్మించుకోవచ్చు. ఆటగాళ్లకు ఎదుగుదలకు అవకాశాలు పెరుగుతాయి. స్టేక్‌హోల్డర్లకు ఎక్కువ లాభం తెస్తుంది.  ప్రాంతవ్యాప్తంగా ప్రేక్షకులతో ఎంగేజ్‌మెంట్ పెంచుకోవచ్చు అని చెప్పారు. 

ఈ లీగ్‌కు ప్రపంచకప్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫేస్‌గా ఉన్నారు. 2026 ఎడిషన్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే వంటి భారత స్టార్‌లు పాల్గొని లీగ్ ప్రతిష్ఠను పెంచారు.

తొమ్మిదో ఫ్రాంచైజీతో టీ20 ముంబై లీగ్ ముంబై, పరిసర ప్రాంతాల్లోని యువ క్రికెటర్‌లకు మరింత బలమైన వేదికగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.