Reading Time: 4 minutes

జ్యోతిష్యం: పౌర్ణమి వేళ తులారాశిలో బుధుడు, శుక్రుడు.. కర్కాటకంలో గురుడు.. ఎవరికిలాభం.. ఎవరికి నష్టం.. 12 రాశుల ఫలితాలు ఇవే..!

Caption of Image.

ఆస్ట్రాలజీ ప్రకారం నవగ్రహాల కదలికలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యనిపుణులు అంటున్నారు. బుధుడు నవగ్రహాలకు యువరాజుగా ఉంటాడని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. బుధుడు తెలివితేటలు, చదువు, వ్యాపారం, సంపాదన ఇతర అంశాలపై ప్రభావం చూపుతాడనేది పండితుల మాట. 

బాధ్రపద మాసం పౌర్ణమి రోజు ( సెప్టెంబర్​ 26)  తులారాశిలో బుధుడు ప్రవేశంతో కొన్ని  రాశులకి మంచి లాభాలు వస్తాయనేది శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పటికే అక్కడే ఉన్న శుక్రుడితో కలిసి సంచారం వలన కొంతమంది ఆర్థిక పరిస్థితిలో మార్పులు, వ్యాపారంలో లాభాలు పొందుతారు. తులారాశిలో బుధుడు, శుక్రుడు.. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలో సంచారం వలన  జ్యోతిష్య  శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. .

మేషరాశి :  బుధుడు.. శుక్రుడు  తులారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి  ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు పండితులు. కుటుంబ అవసరాలు తీర్చేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది.  ప్రభుత్వ రంగం నుంచి ఆర్ధికంగా లాభాలు పొందే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే జాబ్​ లో వారి పరిస్థితులను బ్యాలెన్స్​ చేసుకుంటారు.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్​ రావడం.. కొత్త ప్రాజెక్ట్​ లు చేపట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.  మొత్తంగా మేష రాశి వారికి ఈ కాలం విజయపథాన్ని చూపిస్తుంది.

 వృషభ రాశి : బుధుడు తులారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది.   కొత్తగా ఇంటి నిర్మాణానికి ప్లాన్​ వేస్తారు. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు.  ఇక ఆర్థిక విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆస్తి వివాదాలు సానుకూలపడతాయి.  పూర్వీకుల ఆస్థి కలసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్నీ విధాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు.  అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

 మిధునరాశి:  బాధ్రపద మాసం పౌర్ణమి వేళ  బుధుడు తులారాశిలో సంచారంతో ఈ రాశి వారికి  పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ రాశి వారికి వృత్తి పరంగా గౌరవం లభిస్తుంది. వాహనాలు, స్థిరాస్థిని కొనుగోలు చేసే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలతో పాటు.. ఆస్తి, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.  ఇక అమ్ముడు పోవు అనుకున్న వస్తువులు.. వెంటనే సేల్​ అవుతాయి. కుటుంబసభ్యల మధ్య వివాదాలు పరిష్కారం కావడంతో సంతోషకరంగా గడుపుతారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. 

 కర్కాటక రాశి:  ఈ ఏడాది బాధ్రపద మాసం పౌర్ణమి వేళ ..గురు గ్రహం  కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండటం.. తులా రాశిలో బుధుడు, శుక్రుడు సంచారం వలన ఈ రాశి వారికి  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  కార్యాలయంలో  గౌరవం లభిస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా మెరుగైన స్థితిలో ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి విహార యాత్ర చేసే అవకాశం ఉంది. గతంలో రావలసిన డబ్బు చేతికందుతుంది. కొత్త ఉద్యోగాలకు అవకాశం వచ్చి.. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. టీం లీడర్ గా మంచి విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో అధికంగా లాభాలు గడించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

సింహరాశి : బుధుడు తులారాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయని  పండితులు చెబుతున్నారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. కుటుంబంపై దృష్టి.. ఆదాయ, వనరులను పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు.  చాలా వరకు ఈ రాశి వారి పరిస్థితులు సవాలుతో కూడుకుని ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యక్తిగత జీవితంలో.. వృత్తి, వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులుంటయాయని పండితులు అంటున్నారు.  కార్యాలయంలో ఇంట్లో అపార్థాలకు, గొడవలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.

కన్యారాశి : గురుడు కర్కాటకంలో.. తులారాశిలో బుధుడు.. శుక్రుడు సంచారం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ రాశి వారు  ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి,  కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరుల చెప్పిన మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాల విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.   ఉద్యోగులకు మాత్రం అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.టెక్నికల్ రంగాల్లో పనిచేసే వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. హామీ సంతకాలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు

 తులారాశి:  భాద్రపద పౌర్ణమి నాడు శుక్రుడు.. బుధుడు తులారాశి సంచారం  వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కలిగే అవకాశం ఉంది.  వీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు ఏర్పడతాయి.  జీవిత భాగస్వామ్యం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో తులారాశి వారు పెట్టిన పెట్టుబడులు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి.క్రియేటివిటీ మెరుగవుతుంది. ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి, కొత్త బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్న వారికి ఈ సమయం మంచి అవకాశాలను ఇస్తుంది. వ్యాపారస్థులు, ఉద్యోగస్తులు మంచి లాభాలను పొంది.. సంపద పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు. ఇంటి నిర్మాణం చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

 వృశ్చికరాశి :  తులారాశిలోకి బుధుడు రావడం వలన.. ఈ రాశి వారిఇ  విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన సమయం. లీడర్ షిప్.. నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి సమాజంలో గుర్తింపు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది.  వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా సాగుతాయి.  నిరుద్యోగులు శుభవార్త వింటారు.  ఉద్యోగస్తులకు గ్రహాల అనుకూలత వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.  స్త్రీల విషయాల్లో మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి. ఇరుగుపొరుగు వారితో కానీ, బంధుమిత్రులతో కానీ అనవసరమైన వాగ్వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

  ధనుస్సురాశి :  గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో .. బుధుడు, శుక్రుడు తులా రాశిలో సంచారం వల న ఈ రాశి వారికి  కొత్త ఆదాయ మార్గాల ద్వారా చాలా డబ్బు సంపాదించగలరు. వృత్తిపరంగా నిరుద్యోగులకు ఈ కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా గడుస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది,  పెండింగ్ లో  ఉన్న కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. మీ పనికి అధికారుల మెప్పు లభిస్తుంది. ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలను వింటారు. ఈవారం మొత్తం అన్ని వర్గాల వారికి అనుకూలంగానే ఉన్నప్పటికీ పని ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

మకర రాశి : తులారాశిలో బుధుడు ప్రవేశంతో .. ఈరాశి వారికి  కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.   భారీ పెట్టుబడులకు దూరంగా ఉండండి. వ్యాపారపరమైన ముఖ్యమైన నిర్ణయాల విషయంలోజీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోయినా నష్టం ఉండదు.  ఉద్యోగస్తులకు పనిపై శ్రద్ధ చాలా అవసరం.  అనవసరంగామాట పడే అవకాశాలున్నాయి.  ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం చాలా అవసరం.  అకస్మాత్తుగా వ్యాపారపరంగా గాని, ఉద్యోగపరంగా గాని దూర ప్రయాణాలు చేసే అవసరం పడవచ్చు.  ఆరోగ్య విషయంలో  చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

 కుంభరాశి:  బుధుడు .. తులారాశిలో సంచారం వలన  ఈరాశి వారికి  ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. స్థిరాస్థికి సంబంధించి కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దుబారా ఖర్చులు పెరుగుతాయి.  అనుకున్న  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్తగా ఆదాయ మార్గాలకు  శ్రీకారం చుడతారు. జాబ్​ మారేందుకు ఇది అనుకూలమైన సమయంం.  వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.

 మీనరాశి : తులారాశిలోకి బుధుడు రావడంతో.. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి. మీ రిలేషన్​ షిప్​  కూడా బాగుంటుంది. వృత్తి, వ్యాపార రంగంలో పెద్ద మేలు కలుగుతుంది . ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. లైఫ్​ లో సెటిల్​ అయ్యే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం

©️ VIL Media Pvt Ltd.