Reading Time: 2 minutes

8 మ్యాచ్‌లు.. 8 నగరాలు: భారత్ vs వెస్టిండీస్ సిరీస్ పూర్తి షెడ్యూల్, స్క్వాడ్స్, స్ట్రీమింగ్ ఇదే!

Caption of Image.

India vs West Indies Schedule: సొంతగడ్డపై మరో ఆసక్తికర క్రికెట్ పోరుకు భారత జట్టు సిద్ధమైంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్‌తో టీమిండియా 3 వన్డేలు, 5 టీ20ల వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. ఈ ఎనిమిది మ్యాచ్‌ల హోమ్ సిరీస్‌లో కరేబియన్లను క్లీన్ స్వీప్ చేసి, ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు పూర్తి విశ్వాసంతో వెళ్లాలని భారత్ భావిస్తోంది.

కెప్టెన్లుగా గిల్, శ్రేయస్ శ్రేయస్: 

ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు పవర్ ప్యాక్డ్ టీమ్‌లను ప్రకటించింది. వన్డే సిరీస్‌కు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా, టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు వెస్టిండీస్ జట్టు రెండు ఫార్మాట్లలోనూ షాయ్ హోప్ సారథ్యంలో బరిలోకి దిగనుంది.

మ్యాచ్ టైమింగ్స్: 

* వన్డే మ్యాచ్‌లు: మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. మ్యాచ్‌కు అర గంట ముందు (మధ్యాహ్నం 1:00 గంటలకు) టాస్ పడుతుంది.

* టీ20 మ్యాచ్‌లు: రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6:30 గంటలకు టాస్ ఉంటుంది.

IND vs WI పూర్తి షెడ్యూల్: 

వన్డే సిరీస్:

*1వ వన్డే: సెప్టెంబర్ 27 (తిరువనంతపురం)
* 2వ వన్డే: సెప్టెంబర్ 30 (గౌహతి)
* 3వ వన్డే: అక్టోబర్ 3 (న్యూ ఛండీగఢ్)

టీ20 సిరీస్:

* 1వ టీ20: అక్టోబర్ 6 (లక్నో)
* 2వ టీ20: అక్టోబర్ 9 (రాంచీ)
* 3వ టీ20: అక్టోబర్ 11 (ఇండోర్)
* 4వ టీ20: అక్టోబర్ 14 (హైదరాబాద్)
* 5వ టీ20: అక్టోబర్ 17 (బెంగళూరు)

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?: 

* టీవీ టెలికాస్ట్: భారత్‌లో ఈ మ్యాచ్‌లు Star Sports Network ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

* లైవ్ స్ట్రీమింగ్: మొబైల్, ల్యాప్‌టాప్‌లలో JioHotstar యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ చూడవచ్చు.

ALSO READ : IPLలో తోపు.. న్యూజిలాండ్‌లో కాదు..

రెండు జట్ల పూర్తి స్క్వాడ్‌లు: 

భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.

భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జాన్ కాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, విటెల్ లాస్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.

వెస్టిండీస్ టీ20 జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, షిమ్రాన్ హెట్‌మైర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, కమిల్ పూరన్, రోవ్‌మన్ పొవెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ సామ్సన్, రొమారియో షెపర్డ్, షమర్ స్ప్రింగర్.
 

©️ VIL Media Pvt Ltd.