Reading Time: < 1 minute

మంచిర్యాల కనెక్టివిటీకి ప్రయారిటీ : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Caption of Image.

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మౌలిక వసతుల కల్పన కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  తెలిపారు. ప్రజలకు మెరుగైన రోడ్లు, సౌకర్యాలు అందించడానికి ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు.

మంచిర్యాల కార్పొరేషన్​పరిధిలోని ఆరో డివిజన్​లో నేషనల్ హైవే నుంచి పోచమ్మ గుడి మీదుగా శ్రీరాంపూర్​3మైన్​- ఫ్యాన్ హౌస్ వరకు  బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కార్పొరేటర్​ వనపర్తి కేత రాజేష్, సీనియర్​ కాంగ్రెస్​ నేత జగన్​మోహన్​రావు తన దృష్టికి తీసుకవచ్చారన్నారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న  రోడ్డు నిర్మాణాన్ని వెంటనే  చేపట్టాలని శ్రీరాంపూర్​ సింగరేణి జీఎమ్​కు సూచించినట్లు ఎంపీ చెప్పారు.  తద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందడంతో పాటు, ప్రాంత అభివృద్ధికి మరింత అనుకూలంగా మారుతుందన్నారు. 

©️ VIL Media Pvt Ltd.