Reading Time: < 1 minute

గణేశ్ నిమజ్జన డ్యూటీలో ఉన్న ఎస్ఐ మృతి..

Caption of Image.
  • ర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. హిట్‌‌ అండ్‌‌ రన్‌‌గా కేసు

ట్యాంక్‌‌బండ్, వెలుగు: గణేశ్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్‌‌ఐను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌‌లో ఎస్‌‌ఐగా పనిచేస్తున్న వెంకన్న (59) గణేశ్ నిమజ్జనం డ్యూటీ కోసం హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ మార్గ్‌‌లోని క్రేన్ నంబర్-2 వద్ద విధుల్లో ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం వెంకన్నను ఢీకొట్టింది.

దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సైఫాబాద్ పోలీసులు శ్రీకర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బుధవారం వరంగల్‌‌లోని తన ఇంటికి వెళ్లారు. అయితే ఒంట్లో నొప్పులు ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు వరంగల్‌‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం వెంకన్న మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే తెల్లవారుజామున వెంకన్న ఇచ్చిన స్టేట్‌‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ ఇన్‌‌స్పెక్టర్ నాగేశ్వర్‌‌రావు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌‌ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు

©️ VIL Media Pvt Ltd.