
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి బయలుదేరిన ఇండిగో విమానానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. రాజమండ్రి విమానాశ్రయం దగ్గర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.
అనంతరం.. వాతావరణం మెరుగుపడిందన్న సమాచారంతో మరోసారి రాజమండ్రి వైపు బయలుదేరింది. అయితే మళ్లీ వాతావరణం ప్రతికూలంగా మారడంతో.. విమానం మళ్లీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వచ్చినట్లు సమాచారం.
ఒకటికి రెండు సార్లు విమానం గాల్లోకి టేకాఫ్ అవడం.. తిరిగి మళ్లీ శంషాబాద్లోనే ల్యాండ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. రాజమండ్రి చేరాల్సిన విమానం పలుమార్లు తిరిగి హైదరాబాద్‌కు రావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వాతావరణం అనుకూలంగా లేకపోతే.. విమానాన్ని రద్దు చేసి ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోమని చెప్పాలి గానీ ఇలా ఒకటికి రెండు సార్లు టేకాఫ్, ల్యాండింగ్ ఏంటని ప్రయాణికులు మండిపడ్డారు.