
అమెరికాలో ఉద్యోగం అంటే డాలర్ల వర్షం కురుస్తుందని అనుకుంటారు అందరూ. కానీ అక్కడ ఉండే ఖర్చులు, ముఖ్యంగా ఇంటి అద్దెలు చూస్తే మాత్రం ఎవరికైనా మతిపోవాల్సిందే. న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న ఓ భారతీయ మహిళ తన ఇంటి అద్దె గురించి చెప్పిన నిజాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిండి కొద్ది రొట్టె అన్నట్లుగానే ఆదాయం, ఖర్చులు కూడా దేశాలను బట్టి మారుతుంటాయ్. చాలా మంది ఇండియన్ ఫ్యామిలీస్ వీడిని పట్టించుకోకుండా మా వాడికి లక్షల్లో జీతం అంటూ మురిసిపోతుంటారు. వాస్తవానికి అక్కడి ఖర్చులకు అనుగుణంగానే అక్కడి జీతాలు కూడా ఉంటాయని ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్ హెగ్డే ఇంటర్వ్యూలో బయటపడింది.
నెలకు రూ.10 లక్షల అద్దె..
ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఎంట్రప్రెనర్ అయిన ఖుషీ జైన్.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. శరణ్ హెగ్డే తన అపార్ట్‌మెంట్‌లో వీడియో తీస్తున్న సమయంలో ఆమెను అద్దె ఎంత అని ప్రశ్నించగా.. ఆమె ఏమాత్రం తడబడకుండా నెలకు 10 వేల డాలర్లు అని బదులిచ్చారు. దీన్ని మన భారతీయ కరెన్సీలో లెక్కిస్తే అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. 2BHK రెంట్ వినగానే హెగ్డే ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
మ్యాన్‌హాటన్‌లో ఇరుకైన ప్రాంతాలైనా అంతే..
మ్యాన్‌హాటన్ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలున్న రెండు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూమ్‌లు ఉన్న అపార్ట్‌మెంట్ కావాలంటే ఈ మాత్రం ఖర్చు పెట్టక తప్పదని ఖుషీ జైన్ చెప్పారు. ఆ రోజుల్లో తాను ఇల్లు వెతికే సమయంలో రూ.10 లక్షల కంటే తక్కువకు మంచి ఇల్లు దొరకలేదని, అందుకే చివరికి ఆ ప్రాంతం నుంచి వేరే చోటుకి మారాల్సి వచ్చిందని తెలిపారు. బ్రూక్లిన్, క్వీన్స్, ఆస్ట్రియా వంటి న్యూయార్క్‌లోని ఇతర ప్రాంతాల్లో మాత్రం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఇళ్లు అద్దెకు దొరుకుతాయని చెప్పారు.
ఏడాదికి రూ. కోటి పైచిలుకు ఖర్చులు
కేవలం ఇంటి అద్దె మాత్రమే కాకుండా రెంట్, ఇతర రోజువారీ ఖర్చులన్నీ కలుపుకుని నెలకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చవుతున్నాయని ఆమె చెప్పారు. అంటే కేవలం జీవనం సాగించడానికే వీరు ఏడాదికి రూ. కోటి నుంచి రూ.కోటి 20 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తేలింది. న్యూయార్క్ నగరంలో ఖర్చులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.
నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున వాదన మొదలైంది. మ్యాన్‌హాటన్‌లో రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకే మంచి అపార్ట్‌మెంట్లు దొరుకుతాయని.. రూ.10 లక్షలు అనేది చాలా ఎక్కువ అని కొందరు కామెంట్లు చేశారు. అయితే అమెరికాలో సంపాదన కూడా అదే స్థాయిలో ఉంటుందని, కాబట్టి రూపాయల్లోకి మార్చి చూస్తేనే మనకు ఎక్కువ లాగా కనిపిస్తుందని మరికొందరు వాస్తవాన్ని గుర్తుచేస్తున్నారు. డాలర్లను మన రూపాయల్లోకి మార్చి చాలా ఖర్చు అమెరికాలో బతకటం అనుకోవటం మూర్ఖత్వం అని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ న్యూయార్క్ నగర నివాసం అందరికీ సాధ్యం కాదనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
[1:29 PM, 9/25/2026] Kishore Anna @OI: