
సర్ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓటర్లను అక్రమంగా తొలగించారని సీజేపీ ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు. దేశంలోని యువతను ఓటర్లుగా నమోదు కాకుండా సర్ తో అడ్డుకున్నారని ఆరోపించారు. ఫాం 6లో పేరెంట్స్ వివరాలకు సంబంధించిన ఆప్షనల్ క్వశ్చన్ ను.. ఎలక్షన్ కమిషన్ డేటా ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ లో మాండేటరీ చేయడం ద్వారా దేశంలో కొత్త ఓటర్లు నమోదును అడ్డుకోవడం, అక్రమంగా ఓటర్లను నమోదు చేయడం ఒకేసారి చేశారని ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు సీజేపీ ప్రతినిధులు. 48 గంటల్లో ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని లేదంటే మరో జంతర్ మంతర్ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ప్రకారం.. నాలుగు మార్గాల ద్వారా దేశంలో అక్రమంగా ఓటర్ల తొలగింపు,అక్రమంగా ఓటర్ల చేర్పులు జరిగాయని, ఇదే విషయాన్ని 14 ఫిర్యాదుల ఆబ్జక్షన్స్ ద్వారా ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లతో ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారు. ఎలక్షన్ రూల్స్ కు విరుద్దంగా కొత్త ఓటర్లను లిస్టు కాకుండా అడ్డుకున్నారని, ఇందులో ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ణానేష్ కుమార్ పాత్ర ఖచ్చితంగా ఉందని సీజేపీ ప్రతినిధులు ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ఇటీవల ప్రవేశపెట్టిన ఐటీ (IT) వ్యవస్థ కేంద్రీకరణ, ECINet, ERONET సాఫ్ట్‌వేర్ల నిర్వహణ విధానం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి అధికారాలు బదలాయించడంపై ఈసీ అంతర్గతంగానే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంలో అంతర్గతంగా జరిగిన మార్పులు, ఇదే విషయంపై ఇద్దరు కమిషనర్లు ఆబ్జక్షన్లు చెప్పడం.. దేశంలో కొత్త ఓటర్ల నమోదు, టార్గెటెడ్ ఓటర్ల తొలగింపు జరిగినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు చెబుతోంది.
సర్ ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో 60 లక్షల మందిని ఓటర్లను తొలగించారు. పేర్లు మ్యాచ్ కాలేదని, పేరెంట్స్ వివరాలు 2002 సర్ లో లేవని కారణాలతో లాజికల్ గా అక్రమంగా ఆ ఓట్లను తొలగించారన్నారు. అనంతరం 35 మందిని అర్హులైన ఓటర్లు గా నమోదు చేశారు. ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లతో ఇద్దిరికి తెలియకుండానే వీరిని చేర్చారని అది ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ణానేష్ కుమార్ సొంత నిర్ణయాలతో అక్రమంగా ఓటర్లను నమోదు చేశారని తెలిపారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
మరో వైపు దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియతో కోట్లాది ఓట్లను తొలగించిన ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ణానే ష్ కుమార్ వెంటను రాజీనామా చేయాలని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే అల్టీమేట్ జారీ చేశారు. 48 గంటల్లో జ్ణానేష్ కుమార్ రిజైన్ చేయాలని లేదంటే మరో జంతర్ మంతర్ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
VIDEO | Cockroach Janta Party co-convenor Saurav Das (@SauravDassss) puts forward three demands related to Election Commission of India.
He says, “Look, this is a very big conspiracy being plotted against the youth of the country, and we, the people of the country, will… pic.twitter.com/4Gyp8Rh5Vy
— Press Trust of India (@PTI_News) September 24, 2026