Reading Time: < 1 minute
Chandrababu Naidu Begins Three Day Foreign Trip With Family

CM Chandrababu Foreign Trip: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ప్రతిరోజూ ఏదో కార్యక్రమంతో బిజీగా ఉండే చంద్రబాబు.. ఈ సారి కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు.. ఇవాళ్టి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగా మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రైవేట్ పర్యటన కావడంతో ఆయన వెళ్లే దేశం, బస చేసే ప్రాంతానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ నెల 28న తిరిగి అమరావతికి చేరుకోనున్నట్లు తాజా సమాచారం. ఇక, విదేశీ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి పాలనా కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ఐదు రోజుల పాటు వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలు, పర్యటనలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో జిల్లాల పర్యటనలతో పాటు వివిధ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు
* ఈ నెల 29న విజయవాడలో కర్మయోగి మిషన్‌ కార్యక్రమం.. అనంతరం ఉదయగిరిలో పల్లె పండుగ కార్యక్రమం.
* ఈ నెల 30న విజయవాడలో 24 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
* అక్టోబర్‌ 1న పేదల సేవలో కార్యక్రమంలో సీఎం… సామాజిక పెన్షన్ల పంపిణీ
* అక్టోబర్‌ 2న మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన.
* అక్టోబర్‌ 3న పాన్‌ ఐఐటీ సదస్సుకు చంద్రబాబు…