
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించే శుభవార్త వచ్చేసింది. సినిమా షూటింగ్ లో భుజానికి గాయం కావడంతో గత కొన్ని వారాలుగా కెమెరాలకు, ప్రమోషన్లకు దూరంగా ఊంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు తారక్. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో మళ్లీ సందడి చేసేందుకు మైక్ పట్టుకోబోతున్నారు. విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన విజువల్ వండర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో.. ఆయన తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ షోయింగ్ బిజినెస్, ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెనెటిక్ బాండింగ్ వంటి స్నేహబంధం ఉన్న జక్కన్న కాంపౌండ్ కోసం, తన గాయాన్ని కూడా లెక్కచేయకుండా తారక్ ఈ గ్రాండ్ ఈవెంట్‌కి ఓకే చెప్పారు. సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్‌లో ఈ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. దీనిపై మేకర్స్ ఒక ఫన్నీ వీడియో రిలీజ్ చేసి.. ఎన్టీఆర్ రాకను అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
నందమూరి బాలకృష్ణ తన ఐకానిక్ డైలాగ్‌తో ఈ చిత్ర ట్రైలర్‌కి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రాణం పోశారు. ఇప్పుడు అబ్బాయ్ ఎన్టీఆర్ స్టేజ్ పైకి వచ్చి హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లబోతున్నారు. శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ స్ట్రీట్ మ్యాజిషియన్ పాత్రలో కనిపిస్తుండగా, సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న ఓ చిన్న పాపతో ఆయన చేసే అడ్వెంచరస్ అండ్ ఎమోషనల్ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం.
►ALSO READ | డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ సెట్స్‌పై ప్రభాస్, కమల్, బిగ్‌బీ పోరుకు టైమ్ ఫిక్స్!
ఈ ఫాంటసీ థ్రిల్లర్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో బాక్సాఫీస్ వద్ద ఇది పక్కా మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గాయం తర్వాత తారక్ ఇచ్చే ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు..
Annnaaa……………. ❤️❤️❤️
Idhi kadara Manaki kavalsina emotion uu…. 🔥
The Apocalyptic Mass Hurricane @tarak9999 is all set to grace the #DontTroubleTheTrouble Pre Release Event 💥💥
September 29th – JRC, Hyderabad.#DTTTMovie #DTTTonOct2nd pic.twitter.com/L1kD957KKM
— Arka Mediaworks (@arkamediaworks) September 26, 2026