
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. లేటెస్ట్ గా తన 56వ చిత్రాన్ని (D56) అధికారికంగా లాంచ్ చేశారు . బ్లాక్‌బస్టర్ ‘లబ్బర్ పందు’ మూవీ ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు శివగంగ జిల్లాలోని ప్రసిద్ధ మారనాడు కరుప్పణసామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ధనుష్ 18 అడుగుల భారీ కొడవలి (అరివాళ్) కానుకగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
18 ఏళ్ల వివాదానికి తెర..
ఈ సినిమా లాంచ్ వేడుకలో వడివేలు, ధనుష్ కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది. 2008లో ‘పడిక్కాదవన్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు రావడం, వడివేలు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం కోలీవుడ్‌లో పెద్ద సంచలనమైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ పూజా వేదికపై వడివేలు స్పందిస్తూ.. మూడో వ్యక్తి కల్పించిన మనస్పర్థల వల్లే మేం ఇన్ని రోజులు కలిసి పనిచేయలేకపోయాం. ఈ కథ వినగానే చాలా సర్ ప్రైజ్ అయ్యాను అని క్లారిటీ ఇచ్చారు.
#Vadivelu:
“After a long gap I got an opportunity to work with #Dhanush sir with #D56. You might ask why there is so much gap that we didn’t collaborate, it’s because of some misunderstanding between us done by third person. It’s not a Political film, it’s very different film. I…— AmuthaBharathi (@CinemaWithAB) September 25, 2026
క్రేజీ కాంబినేషన్..
ఈ మూవీలో ధనుష్‌కు జోడీగా ప్రీతి ముకుందన్ నటిస్తుంది. ఇక ఎస్‌జే సూర్య, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ ప్రైమ్‌మార్క్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ALSO READ : గడ్డం లేదు బాస్.. ఇప్పుడు ఏం చేద్దాం?
బిజీ బిజీ గా..
ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలోని ‘ఓం’ (OM) నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు మారినాడు ఆలయం కేంద్రంగా అంగరంగ వైభవంగా షురూ అయిన ఈ ‘D56’ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వడివేలు కాంబో రిపీట్ కావడం.. ‘లబ్బర్ పందు’ డైరెక్టర్ కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.