Reading Time: 3 minutes

జ్యోతిష్యం:గణేశుడు గంగమ్మ ఒడికి..నాలుగు శుభ యోగాలు.. ఐదు రాశుల వారి జీవితంలో సరికొత్త మలుపు

Caption of Image.

వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.  సెప్టెంబర్​ 25 శుక్రవారం అనంత చతుర్దశి రోజు గణేశ్​ మహారాజ్​ కి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు.  అంతేకాదు ఈ రోజు ( సెప్టెంబర్​ 25) న జ్యోతి ష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేశుడు గంగమ్మ ఒడికి చేరే సమయంలో .. కొన్ని గ్రహాలు కలయిక వలన నాలుగు శుభ యోగాలు ఏర్పడుతాయని చెబుతున్నారు.  ఈ యోగాల ప్రభావంతో ఐదు రాశుల వారి జీవితంలో సరికొత్త మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఏఏ యోగాలు ఏర్పడుతాయి.. అదృష్టం వరించే రాశుల వివరాల గురించి తెలుసుకుందాం. . 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనంత చతుర్దశి ( సెప్టెంబర్​ 25 ) ఆధ్యాత్మికంగానూ.. ఆస్ట్రాలజీ ప్రకారం ఎంతో విశిష్టమైనది.  ఈ రోజు గణేశుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు.  ఇలాంటి ప్రాముఖ్యత.. విశిష్ఠమైన రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  అరుదైన గ్రహాలు కలయిక వలన   సర్వార్థ సిద్ధి, రవి, నీచభంగ, బుధాదిత్య రాజయోగం అనే నాలుగు అద్భుతమైన యోగాలు ఒకేరోజు ఏర్పడుతున్నాయి.

  • శుక్రవారం రోజు రెండు నక్షత్రాలు ఉంటే  సర్వార్ధసిద్ది యోగం
  • సూర్యుడు..చంద్రుడు సంచరించే రాశులు..నక్షత్రాల ఆధారంగా రవియోగం
  • కర్కాటకంలో కుజుడు నీచ స్థితిలో ..గురుడు ఉచ్ఛ స్థితిలో ఉంటే నీచభంగ యోగం..
  •  ఒకేరాశిలో సూర్యుడు ..బుధుడు కలయిక వలన బుధాదిత్య రాజయోగం 

ఇలాంటి ఈ పర్వదినం శుక్రవారం రావడం వల్ల, సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి కటాక్షం కూడా  ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభ రాశి : ఈ  రాశి వారికి  అరుదైన గ్రహాలు కలయిక వలన అదృష్టం తలుపు తట్టనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పటి వరకు మిమ్మలను వేధిస్తున్న సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. కెరీర్‌  విషయంలో అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  దీంతో ఆర్థికం స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినా కాని.. ప్లాన్​ ప్రకారం పూర్తి చేయడంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. గతంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది.   కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.  తక్కువ శ్రమ..ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.   సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, తమ ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మిథున రాశి :   అనంత చతుర్ధశి రోజు నాలుగుశుభయోగాలు ఏర్పడటం వలన ఈ రాశి వారికి ఆలోచనా శక్తి పెరుగుతుంది. . ఉన్నత విద్యాభ్యాసం లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా మీ వృత్తి జీవితంలో ఊహించని పురోగతిని సాధిస్తారు. వృత్తిపరమైన పురోగతి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆర్థిక అవకాశాలు బలపడతాయి. ఊహించని మార్గాల ద్వారా కూడా సంపద కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

కన్యా రాశి :   ఈ రాశి వారు అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు ఎంతో  అత్యంత అనుకూల సమయమని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. భారీ ఒప్పందాలు (డీల్స్), కొత్త ఆర్డర్లు మీ సొంతమవుతాయి. ఊహించని విధంగా ధనలాభం చేకూరే అవకాశం ఉంది.  మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకొనే వ్యూహాత్మక నిర్ణయాలు  అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. వీరికి అనారోగ్యానికి తగ్గ సరైన చికిత్స లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. 

 తులా రాశి:ఈరాశి వారికి  స్వర్ణయుగం ప్రారంభం కాబోతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. గతంలో నిలిచిపోయిన బకాయిలు చేతికి అందడంతో  ఆర్థికంగా చాలా బలపడతారు.వృత్తి జీవితంలో మీరు వేసే ప్రతి అడుగు విజయతీరాలకు చేరుస్తుంది.  వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.  ఖరీదైన వస్తువులలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వృత్తి..ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.   కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది

 కుంభ రాశి:  ఈ రాశి వారికి నాలుగు శుభయోగాల వలన  సృజనాత్మకత తారాస్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. మీ తెలివితేటలతో  కీర్తిని, సంపదను పొందుతారు. వృత్తిపరంగా మీ పనితీరుకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు  మీ జీవితాన్ని మార్చేసే ఒక శుభవార్త వినే అవకాశాలున్నాయికష్టానికి తగిన ఫలితం ఉంటుంది.  ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. జీవితంలో సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. టెక్నాలజీ …  మేనేజ్‌మెంట్‌కు రంగాలవారు బాగా  విజయం సాధిస్తారు.  ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అనుకోని విజయాలు లభించే అవకాశం ఉంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండాఆర్డర్లు  లభిస్తాయి.ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు  అనుకూలంగా పరిష్కారం అవుతాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.