Reading Time: 2 minutes

ఈసీ జ్ణానేష్ కుమార్ పెద్ద దేశద్రోహి: కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే

Caption of Image.

ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జ్ణానేష్ కుమార్ ఓ పెద్ద  దేశద్రోహి అని ఆరోపించారు. 

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ డిప్కే మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మెజారిటీ సాధించలేకపోవడంతో ఆ వర్గం ఆందోళనకు గురయిందన్నారు. 400 పార్  (400కు పైగా సీట్లు) అనే నినాదాన్ని ఇచ్చినప్పటికీ వారు 240 సీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆ తర్వాత దేశంలో ప్రజాభిప్రాయం మారుతోందని, ప్రాంతీయ శక్తులు బలపడుతున్నాయని గ్రహించిన బీజేపీ.. దేశంలోని ప్రాంతీయ పార్టీల కీలక నేతలపై దృష్టి సారించిందన్నారు. బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కవడంతో మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సీపీ (NCP), ఎం.కె. స్టాలిన్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ -ఇలా దేశం నలు మూలల నుంచి వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల కీలక నేతలను ఒక్కొక్కరుగా ఓడిపోయారని ఆరోపించారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. ఇందులో బీజేపీ పక్కా ప్రణాళిక సరళి కనిపిస్తోందన్నారు అభిజిత్ దీప్కే. 

2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఓడిపోయిన కీలక నేతలంతా ఉమ్మడిగా ప్రచారం చేశారు..మరి వారు ఒక్కొక్కరుగా ఎలా ఓడిపోయారని అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నియోజకవర్గం నుంచి 50వేల ఓట్లు తొలగించడంతో  ఆమె సుమారు 15వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎం.కె. స్టాలిన్ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగించడంతో ఆయన సుమారు 45వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నియోజకవర్గం నుంచి 40వేల ఓట్లు తొలగించింది ఈసీ.. దీంతో కేజ్రీవాల్ సుమారు 5వేల  ఓట్ల తేడాతో ఓడిపోయారని ఈసీ, బీజేపీ గుట్టు విప్పారు అభిజిత్ దీప్కే. 

ALSO READ : ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అన్నీ మాట్లాడతా

©️ VIL Media Pvt Ltd.