Reading Time: < 1 minute

మేము ఏ తప్పు చేయకుండా ఎందుకు దిగిపోవాలి: జానీ మాస్టర్ భార్య సుమలతదేవి కామెంట్స్

Caption of Image.

ఏ  తప్పు చేయకుండా ఎందుకు దిగిపోవాలని జాని మాస్టర్ భార్య, డ్యాన్సర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత దేవి ప్రశ్నించారు. 2026 సెప్టెంబరర్ 23న  ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కొందరు దుర్మార్గంగా మినిట్స్ బుక్ ను లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 

తమపై దౌర్జన్యం చేశారని.. కొట్టి బట్టలు లాగే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ గొడవకు కారణం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని అని చెప్పారు.తాము  ఏ తప్పు చేయకుండా ఎందుకు దిగిపోవాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. యూనిట్ బుక్ లో ఏమీ రాయకుండా సంతకాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. 

వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే రెచ్చగొడుతున్నారని తెలిపారు. మా మెంబర్స్ తోనే మమ్మల్ని చంపించే ప్రయత్నం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. మిగతా యూనియన్లకు కూడా అనిల్ వల్లభనేని మీద చాలా ఆరోపణలు ఉన్నాయన్నారు. 
 
అనిల్ వల్లభనేని ఫెడరేషన్ అధ్యక్షుడు గా అర్హుడే కాదని ఈ సందర్భంగా చెప్పారు. రఘు మాస్టర్ మీద మెహర్ బాబా, చిరంజీవి మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ కేసు పెట్టనున్నట్లు చెబుతున్నారు. ఒక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇంకొక ప్రెసిడెంట్ ను ఎలా పెడతారని ప్రశ్నించారు. రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్ మీద కేసు పెట్టామని తెలిపారు. ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఫెడరేషన్ పెద్దలు తమకు  న్యాయం చెయ్యాలి.

©️ VIL Media Pvt Ltd.