
తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వరస సెలవులు కావటంతో కొండకు పోటెత్తారు భక్తులు. వీకెండ్ హాలిడేస్ లో స్వామి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూలో ఉన్నారు.
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరగటంతో.. ఉచిత సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఉచిత దర్శనంలోనే SSD టోకన్ భక్తులకు ఏడు గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.
2026, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం తిరుమల శ్రీవారిని 66 వేల 14 మంది భక్తులు దర్శించుకున్నారు. అత్యధికంగా 31 వేల 92 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4 కోట్ల 44 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే 4 లక్షల 23 వేల తిరుమల లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేశారు. ఇక 2 లక్షల 25 వేల మంది వెంగమాంగ నిత్య అన్నదానం కాంప్లెక్స్ లో అన్న ప్రసాదాలు స్వీకరించినట్లు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
►ALSO READ | పోలవరం ముంపు నుంచి రక్షించండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్ శాఖ లేఖ.. తెలంగాణ డిమాండ్లు ఇవే!