
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల దొంగ, దేశద్రోహి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జ్ణానేష్ కుమార్ ను తక్షణమే పదవినుంచి తొలగించాలని, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. పరస్పర ప్రయోజనాలకోసం ప్రధాని మోదీ, సీఈసీ జ్ణానేష్ కుమార్ తో కుమ్మక్కై ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని శపథం చేశారు.
యూపీ, లక్నోలో..
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యూపీ రాజధాని లక్నోలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఓట్ల దొంగతనానికి పాల్పడి జ్ఞానేష్ దేశద్రోహానికి పాల్పడ్డారు..ఎన్నికల కమిషనర్ పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదు. ఓట్లను దొంగిలించి ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి చేశారు, ఇది క్షమించరాని నేరమని ఆయన తక్షణమే పదవి నుండి తొలగించి, అరెస్టు చేయాలని నిరసనకారులు నినాదాలు చేశారు.
పశ్చిమ బెంగాల్ లో..
దేశ ద్రోహుల చేతినుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఎలక్షన్ సిస్టమ్ లో జవాబుదారీతనం కావాలని పశ్చిమ బెంగాల్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఈసీ జ్ణానేష్ కుమార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనను అరెస్టును డిమాండ్ చేశారు. క్విడ్ ప్రో కో (పరస్పర ప్రయోజనం) కోసం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జ్ఞానేష్ కీలక పాత్ర పోషించారని దుయ్యబట్టారు. అందుకే జ్ణానేష్ కుమార్ కు పద్మ భూషణ్ పురస్కారం ఇవ్వాలని బీజేపీ వర్గాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, సీఈసీ వీరంతా ఓట్ల దొంగల ముఠా అని నినాదాలు చేశారు.
పంజాబ్ లో..
ప్రజాస్వామ్యంలో ఓట్లను దొంగిలించడం దేశద్రోహమే అవుతుంది.. ఈ పనికి పాల్పడిన సీఈసీ జ్ణానేష్ కుమార్ వెంటనే రిజైన్ చేయాలని , అయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో ఆందోళనలు జరిగాయి. రాజ్ బ్రార్ నాయకత్వంలో పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. BJP, -CECల నిరంకుశ పోకడను సవాల్ చేశారు.
హర్యానాలో..
ఓట్ల చోరీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వెంటనే జ్ణానేష్ కుమార్ అరెస్ట్ చేయాలని హర్యానా కాంగ్రెస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజల హక్కులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇక జ్ణానేష్ కుమార్ ప్రధాని మోదీ కూడా కాపాడలేరని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ నిరసనల్లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. భారీ ర్యాలీగా వస్తున్న కార్యకర్తలను బారీకేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు.
బిహార్ లో..
సీఈసీ జ్ణానేష్ కుమార్ ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని మోదీ, జ్ణానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మణిపూర్ లో..
సీఈసీ జ్ణానేష్ కుమార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తాయి. జ్ణానేష్ కుమార్ ను పదవి నుంచితొలగించి అరెస్ట్ చేయాలని ఓక్రమ్ ఇబోబి సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆందోళనలు చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన దేశ ద్రోహికి కఠిన శిక్ష పడేవరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఒడిశాలో..
సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామా, అరెస్ట్ ను డిమాండ్ చేస్తూ ఒడిశాలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారి తనం కోరుతూ ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. రాజ్యాంగం చేతబట్టుకొని ప్రధానిమోదీ, జ్ణానేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఆందోళన వ్యక్తం చేశారు.
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ లో..
సీఈసీ జ్ణానేష్ కుమార్ ఓట్లను చోరీ చేసి దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఎప్పటికీ క్షమించరాని నేరం. జ్ణానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. యువత, మహిళలు నిరసనల్లో పాల్గొని ప్రధాని మోదీ, జ్ణానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్, అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సమక్షంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్ లో..
సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఉత్తరాఖండ్ లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తరాఖంవడ్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ కుమారి సెల్జా జీ, రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గోడియాల్ జీ , CLP నేతల యశ్పాల్ ఆర్య జీ సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఓట్లను దొంగిలించి జ్ణానేష్ కుమార్ దేశద్రోహానికి పాల్పడ్డారని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో..
సీఈసీ జ్ణానేష్ కుమార్ కు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. జ్ణానేష్ కుమార్ ను పదవినుంచి తొలగించాలని, అరెస్ట్ చేయాలని, ఓట్ల దొంగతనం చేసినందుకు గాను కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.