
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)గా బి.నరసింహశర్మ పునర్నియమితులయ్యారు. మరో మూడేళ్లపాటు ఆయనను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
పునర్నియామకం సందర్భంగా ఆయనను గురువారం అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు తదితరులు అభినందించారు.