
హైదరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. 2026 సెప్టెంబర్ 25 సాయంత్రం వరకు దాదాపు ముఖ్యమైన గణనాథుల నిజమ్మనం పూర్తయిందని.. మరో 4,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగాల్సి ఉందని తెలిపారు.
పాతబస్తీ, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి మరిన్ని విగ్రహాలు నిమజ్జనానికి రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు నిమజ్జన ప్రక్రియ సాఫీగా కొనసాగిందని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని.. ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
భక్తులు, నిర్వాహకుల సహకారంతో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బడా గణేష్ శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, అనుకున్న సమయానికే నిమజ్జనం పూర్తి చేశామని చెప్పారు.