Reading Time: < 1 minute

స్క్రాప్‌ లో బయటపడ్డ అస్థిపంజరం.. ఢిల్లీ క్లీనప్ డ్రైవ్ లో మిస్టరీ

Caption of Image.

దేశరాజధాని ఢిల్లీలో చెత్తలో మానవ అస్థిపంజరం ప్రత్యక్షం కలకలం రేపుతోంది. సెంట్రల్ ఢిల్లీలో నిల్వ ఉంచిన స్క్రాప్ లో ఈ స్కెలిటాన్ బయటపడింది. ఓ చెక్క పెట్టెలో ప్యాక్ చేసిన ఉండగా..  క్లీనప్ డ్రైవ్ లో భాగంగా ఆ పెట్టెను పగలగొట్టి చూడగా అస్థిపంజరం కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో  పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని అస్థిపంజరం పరిశీలించారు. అది నిజంగానే మానవ అస్థిపంజరమేనా లేక డమ్మీ నా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. 

►ALSO READ | ఈ కోతి కల్లు తాగలే.. క్వార్టర్ తాగి వైన్స్లో పండుకుంది.. వీడియో వైరల్

శనివారం(సెప్టెంబర్ 26) సెంట్రల్ ఢిల్లీలోని ఓ స్కాప్ దుకాణంలో ఓ పెట్టెలో మానవ అస్థిపంజరం ప్రత్యక్షమయ్యింది. క్లీనప్ డ్రైవ్ లో భాగంగా స్క్రాప్ డీలర్ దుకాణంలో ఉన్న సామాన్లను క్లియర్ చేస్తుండగా సీల్ వేసి ఉన్న పెట్టెలో ఈ అస్థిపంజరం బయటపడింది. ఒక్కసారిగా షాక్ తిన్న యజమాని ఢిల్లీ ఫోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అస్థిపంజరం ఉన్న బాక్సు ఏదైనా ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కుచెందినదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ స్కెలిటాన్ ఉన్న బాక్సుపై స్క్పాప్ డీలర్ ను విచారించగా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.  

అస్థిపంజరం మనిషిదా లేక ఎడ్యుకేషనల్ ప్రాక్టికల్ కోసం ఉపయోగించిన డమ్మీనా అని పరిశీస్తున్నారు అధికారులు. స్క్రాప్ డీలర్ , స్కూల్ యాజమాన్యం ఇద్దరిని విచారిస్తున్నారు పోలీసులు, దర్యాప్తు కొనసాగుతోంది. 

©️ VIL Media Pvt Ltd.