
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వారణాసి’. దాదాపు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ పై ప్రపంచ వ్యాప్తంగా అంచానాలు భారీగా ఉన్నాయి. దాదాపు 606 రోజుల సుదీర్ఘ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే లేటెస్ట్ గా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్‌బాబు కనిపించిన సరికొత్త మేకోవర్ ఇప్పుడు నెట్టింట వెరల్ గా మారింది. లైట్ బ్లూ-గ్రే జిప్-అప్ జాకెట్, క్యాజువల్ టీ-షర్ట్, గ్లాసెస్ , క్యాప్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించిన ప్రిన్స్,.. తన క్లీన్ షేవ్ (Clean Shave) రూపంతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. కెమెరా వైపు చూస్తూ “గడ్డం లేదు బాస్.. ఇప్పుడు ఏం చేద్దాం?” అంటూ సరదాగా సైగ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ కొత్త లుక్ ‘వారణాసి’లోని ఓ కీలక ఎపిసోడ్ కోసమేనని టాక్ వినిపిస్తోంది. ఇందులో మహేశ్ ఏకంగా 24 ఏళ్ల యంగ్ ల్యాడ్‌గా కనిపించనున్నారని, దీనికి ఎలాంటి AI టెక్నాలజీ వాడకుండా కేవలం న్యాచురల్ మేకోవర్‌తోనే పూర్తి చేస్తున్నట్లు సమాచారం. రాజమౌళి ఏఐ సాంకేతికతకు బదులుగా మహేష్ బాబుతో సహజమైన ఫిజికల్ మేకోవర్ చేయించారని తెలుస్తోంది. తన షూటింగ్ షెడ్యూల్స్ ముగించుకున్న మహేశ్, ప్రస్తుతం డబ్బింగ్ పనులకు సిద్ధమవుతున్నారు.
పురాణాలు, కాలాన్ని దాటే టైమ్ ట్రావెల్, శంభవి అనే గ్రహశకలం ముప్పు నేపథ్యంతో సాగే ఈ కథలో మహేశ్ ‘రుద్ర’అనే అడ్వెంచరస్ ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా కథానాయిక ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్’కుంభ’గా నటిస్తుండగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో అలరించనున్నారు. అంతరిక్షం నుండి ప్రాచీన రోమ్, అంటార్కిటికాల వరకు విస్తరించిన ఈ అడ్వెంచర్ కథలో మహేశ్ చూపించబోయే ఈ కుర్రాడి అవతారం థియేటర్లలో సరికొత్త పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
: Superstar #MaheshBabu serving a killer clean-shaven look straight to the camera 🤩🔥#Varanasi pic.twitter.com/SUWNiEIXq6
— 🆃🅰🅼🅸🅻 🅲🅸🅽🅴🅼🅰 🆃🅰🅻🅺🆂 (@tamilcinema_12) September 25, 2026