
మలయాళ స్టార్ నివిన్ పౌలీకి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రీసెంట్ గా ఆయన నటించిన బెత్లహోమ్ కుటుంబ యూనిట్ మూవీ మూడు వందల కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. అటు సూరి కూడా మందాడి చిత్రంతో 100 కోట్ల మార్క్ దాటి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి ఇద్దరు క్రేజీ స్టార్లు చేతులు కలిపి చేసిన తమిళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ యెళు కాదల్ యెళు మలై. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టును తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ఇక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే డబ్బింగ్ వెర్షన్ కు మేకర్స్ అనౌన్స్ చేసిన పేరుతోనే అసలు తలనొప్పి మొదలైంది. ఈ చిత్రానికి ‘సంచారి’ అనే పేరును ఫిక్స్ చేస్తూ పోస్టర్లు కూడా వదిలారు. సరిగ్గా ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
‘సంచారి’ అనే టైటిల్ రైట్స్ ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్ చేతిలో ఉన్నాయి. ఆ నలుగురు, అందరి బంధువయా, ఆటగదరా శివా లాంటి విభిన్న కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్ర సిద్ధార్థ ఎప్పుడో ఈ పేరును రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. ఫిల్మోత్సవ్ నిర్మాణ సంస్థ బ్యానర్ మీద ఫిలిం ఛాంబర్ లో అఫీషియల్ గా లాక్ చేశారు. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఆయన ఈ పేరును సెలెక్ట్ చేసుకున్నారు. కట్ చేస్తే సడెన్ గా నివిన్ పౌలీ డబ్బింగ్ సినిమాకు అదే పేరుతో పోస్టర్లు బయటకు రావడం చూసి ఆయన టీమ్ అంతా కంగుతిన్నారు. సినిమా విడుదలకు ఎక్కువ సమయం కూడా లేదు. ఈ గ్యాప్ లో డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ ఛాంబర్ పెద్దల దగ్గరకు వెళితే గనక డబ్బింగ్ సినిమా యూనిట్ కచ్చితంగా టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
అసలు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ ఈ ‘సంచారి’ టైటిల్ తో తీయాలనుకున్న స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. భారీ ఈ కామర్స్ బిజినెస్ తో కోట్లు గడించిన ఓ బిలియనీర్ కు సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది. తను బ్రతికేది కొద్ది రోజులే అని డాక్టర్లు చెప్పడంతో వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అలా సంచారిగా మారిన ఆ కుబేరుడు దారిలో ఓ ఐదుగురు వ్యక్తులకు సాయం చేయబోతాడు. అయితే వాళ్లు పడుతున్న కష్టాలన్నింటికీ తన సొంత కంపెనీ తీసుకున్న వ్యాపార నిర్ణయాలే కారణమని తెలుసుకుని షాక్ అవుతాడు. ఆ తర్వాత ఓ రాయలసీమ గ్రామాన్ని కాపాడే క్రమంలో హీరోకి ఎదురైన అనుభవాలే ఈ మూవీ మెయిన్ పాయింట్. ఒక మనిషి అసలైన విలువ ఎంతమందికి మనం అవసరం అనే దానిపై కాకుండా, మన వల్ల ఇతరుల జీవితాలకు ఏం జరిగింది అనే ఎమోషన్ చుట్టూ అల్లుకున్న ఈ స్టోరీ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందట.
సంచారి సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.