
Renault Rafale Hypnotic Launched: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault ప్రీమియం SUV Rafaleకి కొత్త స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. Rafale Hypnotic పేరుతో వచ్చిన ఈ మోడల్ కంపెనీ లైనప్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దీని ప్రారంభ ధర 63,550 యూరోలు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.69 లక్షలు. ఈ ధరతో ఇది ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన Renault SUVగా నిలిచింది. Rafale Hypnotic ధర Audi Q5 Sportback, BMW X4, Mercedes-Benz GLC Coupé వంటి ఎంట్రీ-లెవల్ లగ్జరీ SUVల ధరల శ్రేణికి దగ్గరగా ఉంది.
ప్రత్యేకమైన డిజైన్
Rafale Hypnotic స్పెషల్ ఎడిషన్ Atelier Alpine ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. ఇందులో ప్రత్యేకమైన Satin Forest Black పెయింట్ షేడ్‌ను అందించారు. సహజ కాంతి పడినప్పుడు ఈ రంగులో ఆకుపచ్చ లేదా రైన్‌బో తరహా స్వల్ప మెరుపు కనిపించేలా ఫినిషింగ్ ఇచ్చారు. SUV ముందు భాగంలో బ్లాక్-అవుట్ గ్రిల్, డార్క్ ఫినిషింగ్‌తో Renault లోగోను అందించారు. ఇందులోని 21 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కూడా ప్రత్యేక Satin ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
ఎక్స్‌టీరియర్‌లో బ్లాక్ థీమ్
Rafale Hypnoticలో వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, రూఫ్ స్పాయిలర్, బూట్ స్పాయిలర్, రియర్ బంపర్ వంటి ప్రాంతాల్లో గ్లోస్ బ్లాక్ యాక్సెంట్లు ఉన్నాయి. ఈ డార్క్ థీమ్ SUV మొత్తం డిజైన్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. కారు లోపలి భాగంలో కూడా ఇదే డార్క్ థీమ్‌ను కొనసాగించారు. క్యాబిన్‌లో Alcantara, టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీను ఉపయోగించారు. సీట్లపై ఇల్యూమినేటెడ్ Alpine ఎంబ్లమ్‌లను అందించారు. డ్యాష్‌బోర్డ్‌పైనా Alcantara ట్రీట్‌మెంట్ కనిపిస్తుంది. అంతేకాకుండా Hypnotic ప్రత్యేక ఎడిషన్‌లోని ప్రతి వాహనానికి సెంటర్ కన్సోల్‌పై ప్రత్యేక నంబర్డ్ ప్లేక్ ఉంటుంది.
ఫీచర్లకు కొదవ లేదు
Rafale Hypnoticలో అనేక ప్రీమియం ఫీచర్లు అందించారు. ఇందులో LED Matrix Vision హెడ్‌లైట్లు, 9-స్పీకర్ Harman Kardon ఆడియో సిస్టమ్, Solarbay ప్యానరమిక్ గ్లాస్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీట్‌కు మసాజ్ ఫంక్షన్, పుడిల్ లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే Renault Rafale Hypnoticలో కంపెనీకి చెందిన 300hp E-Tech 4×4 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ అందించారు. ఇందులో 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 150hp పవర్, 230Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ సిస్టమ్‌లోని ఎలక్ట్రిక్ మోటార్లలో ముందు భాగంలోని మోటార్ 70hp పవర్, 205Nm టార్క్ అందిస్తుంది. వెనుక మోటార్ 136hp పవర్, 195Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మూడో ఎలక్ట్రిక్ మోటార్ 34hp పవర్, 50Nm టార్క్ తో హై-వోల్టేజ్ స్టార్టర్ జనరేటర్‌గా పనిచేస్తుంది.
22kWh బ్యాటరీ.. 1,000 కి.మీ వరకు రేంజ్
ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVలో 22kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. WLTP ప్రమాణాల ప్రకారం ఇది 105 కిలోమీటర్ల వరకు స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ రేంజ్ అందిస్తుంది. మొత్తం డ్రైవింగ్ రేంజ్ సుమారు 1,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ SUVలో ఆటోమేటిక్ మల్టీ-మోడ్ డాగ్-క్లచ్ గేర్‌బాక్స్ ఉంది. పనితీరు పరంగా కూడా Rafale Hypnotic ఆకట్టుకుంటుంది. ఈ SUV గరిష్ఠంగా 180 kmph వేగాన్ని అందుకోగలదు. 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 6.4 సెకన్లలో చేరుకోగలదని కంపెనీ తెలిపింది.