Reading Time: < 1 minute

ఓటు చోరీ ఇప్పుడు చట్టం చోరీగా మారింది.. సీఈసీ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

Caption of Image.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వ్యక్తి కాదని.. మోదీ, షా ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి అని అన్నారు లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ. ఈ ముగ్గురు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఓటు చోరీ ఇప్పుడు చట్టం చోరీగా మారిందని విమర్శించారు. 2026 సెప్టంబర్ 24న ఈసీ భిన్నాభిప్రాయంపై ప్రెస్ మీట్ నిర్వహించిన రాహుల్ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

రాహుల్ గాంధీ కామెంట్స్:

  • ఉద్దేశపూర్వకంగానే ఓట్ల తొలగింపు
  • పార్టీలను టార్గెట్ చేసి ఓట్లు తొలగించారు
  • ఓటు హక్కును కాలరాస్తున్నారు
  • ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పవర్
  • నేను ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు
  • రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు
  • ప్రజల ఓటును కాపాడటం ఈసీ బాధ్యత
  • సీఈసీ జ్ఞానేష్ కుమార్ మోదీ, షా ద్వారా ఎన్నకోవడ్డ వ్యక్తి.. 
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు
  • ఓటు చోరీ ఇప్పుడు చట్టం చోరీగా మారింది.
  • ఎంత పెద్ద నేత అయిన కొంత కాలం తర్వాత వ్యతిరేకత ఉంటుంది..
  • బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ పాపులారిటీ పెరిగింది
  • ఆ తర్వాత కొంత కాలం తర్వాత ఆమెపై వ్యతిరేక వచ్చింది
  • మోదీపై వ్యతిరేకతను కనబడకుండా చేస్తున్నారు
  • వ్యతిరేకత నుంచి బీజేపీ తప్పించుకోవాలని చూస్తోంది
©️ VIL Media Pvt Ltd.