
వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర బైక్ ఢీకొని ఎసై మృతి చెందటం పోలీస్ శాఖను విషాదంలో ముంచేసింది. 2026 సెప్టెంబర్ 23 తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై వెంకన్న గణేష్ నిమజ్జనం డ్యూటీ హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 2 దగ్గర విధులకు హాజరయ్యారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి.
దీంతో పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు కొత్తగూడెం లోని ఆయన నివాసానికి వెళ్ళాడు. శరీరంలో నొప్పిగా ఉందని తెలిసి కుటుంబ సభ్యులు వరంగల్ ఏంజిఎమ్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఎస్సై వెంకన్న సాయంత్రం మృతి చెందాడు.