
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలో అత్యంత మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును 2025 డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట… త్వరలోనే తమ మొదటి సంతానానికి జన్మనివ్వబోతున్నారు. డిసెంబర్ 2026 నాటికి సమంత డెలివరీ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం సామ్ తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఎంతో హ్యాపీగా, హెల్దీగా గడుపుతున్నారు.
అయితే గర్భవతిగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ విషయంలో సమంత ఎక్కడా తగ్గడం లేదు. లేటెస్ట్ గా జిమ్‌లో ‘బేబీ బంప్’తో వర్కౌట్ చేస్తున్న ఓ క్రేజీ వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆమె ఎంతో నియంత్రణతో ‘సీటెడ్ కేబుల్ రోస్’ (Seated Cable Rows) వ్యాయామం చేస్తూ కనిపించారు. ఈ వీడియోకి వ్యాయామం చేసేటప్పుడు ఒకవైపు ‘చివరి వరకు పట్టుదలతో బలంగా ఉండాలి’ అనే ఆలోచన.., మరోవైపు అలసట వల్ల ‘ఇక నా వల్ల కాదు, నన్ను లేపకండి’ అనే ఫీలింగ్ తన మెదడులో తిరుగుతున్నట్లూ సామ్ ఫన్నీ , క్యూట్ క్యాప్షన్ తో పోస్ట్ చేశారు.
గతంలో కూడా తన ప్రినేటల్ స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి చెబుతూ.. “ఇప్పుడు జిమ్‌లో కష్టపడటం కంటే శరీరం చెప్పేది వినడమే ముఖ్యం” అని స్పష్టం చేశారు సమంత. ఇటీవల కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో శ్రీవిద్య సంప్రదాయం ప్రకారం శ్రీ కల్పం పూజలతో సమంత శీమంతం వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లోనూ హెల్దీ ఫిట్‌నెస్ గోల్స్ సెట్ చేస్తున్న సమంత వర్కౌట్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.