Reading Time: < 1 minute

జనగామ జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ ఆస్తులు జప్తు

Caption of Image.

జనగామ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసు ఆస్తులను జప్తు చేశారు అధికారులు. కోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలోని కుర్చీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఇతర సామగ్రిని కోర్టు సిబ్బంది సమక్షంలో జప్తు చేశారు. కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. 2015, 2016 లో వ్యవసాయ పనిముట్ల కోసం  దీప్తి ఇంజనీర్ వెల్డింగ్ వర్క్స్ సంస్థ సుమారు రూ.18 లక్షల పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం రూ.18 లక్షల డీడీ జారీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఆ డీడీ బౌన్స్ కావడంతో తమకు రావాల్సిన నగదు అందలేదని సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. 

►ALSO READ | పోలీసులపై దాడులు చేస్తే తాట తీస్తాం : ఎస్పీ స్నేహా మెహ్రా వార్నింగ్

కేసును విచారించిన కోర్టు.. బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు సంబంధిత వ్యవసాయ శాఖ ఆఫీసులోని ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో కోర్టు సిబ్బంది 
సమక్షంలో అగ్రికల్చర్ ఆఫీసు లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ సామగ్రి సహా పలు వస్తువులను జప్తు చేశారు. ఈ ఘటనతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సుమారు అర్థగంటపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

©️ VIL Media Pvt Ltd.