
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు గురువారం వరద మరింత పెరిగింది. 5 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 318.40 లెవెల్ నిల్వ ఉంది. నెట్టెంపాడు లిఫ్ట్ కు 1,500, బీమా లిఫ్ట్–-1కి 1,300, బీమా లిఫ్ట్–2కి 750, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 630, ప్యార్లల్ కెనాల్ కు 700, లెఫ్ట్ కెనాల్ కు 800, రైట్ కెనాల్ కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి మొత్తం 5,601 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.