
దేశవ్యాప్తంగా పేరు గాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటకు సంబంధించిన వివరాలను వెల్లడించారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. 2026 సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 5:00 గంటలకు బాలాపూర్ గణేష్ చివరి ప్రత్యేక పూజా కార్యక్రమం ప్రారంభమై, ఉదయం 6:30 గంటలకు పూజా కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం క్రేన్ సహాయంతో గణేష్ విగ్రహాన్ని మినీ ట్రక్కుపై ప్రతిష్ఠించి, ఉదయం 7:00 గంటలకు బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.
ఉదయం 9:00 గంటలకు బాలాపూర్ గణేష్ గ్రామ ప్రదక్షిణ బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. అనంతరం ఉదయం 9:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన, చారిత్రాత్మకమైన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది.
లడ్డూ వేలం అనంతరం ఉదయం 10:00 గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వైపు ప్రారంభమవుతుంది.