Reading Time: < 1 minute

24 గంటల్లోగా రాజీనామా చేయాలి.. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‎కు CJP అల్టిమేటం

Caption of Image.

ముంబై: ఎన్నికల సంఘంలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సెప్టెంబర్ 26లోగా రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అల్టిమేటం విధించింది. గడువులోగా ఆయన రాజీనామా చేయకపోతే అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. సెప్టెంబర్ 26లోగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి వైదొలగాలని అతడు డిమాండ్ చేశాడు. లేదంటే అక్టోబర్ 2 నుంచి ముంబైలో నిరసనలు చేపట్టి ఆ తర్వాత వాటిని దేశమంతటా విస్తరిస్తామని హెచ్చరించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ఎన్నికల సంఘంలో విభేదాలు నెలకొన్నాయని.. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం తెలిపినట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథనం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సీజేపీ ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎన్నికల సంఘంలో చోటు చేసుకున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనకు నైతిక బాధ్యత వహిస్తూ సెప్టెంబర్ 26లోగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డెడ్ లైన్ విధించింది. లేదంటే అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించింది.

ఈ సందర్భంగా సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, పౌరుల ఓటు హక్కును హరించివేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 26లోగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే ఢిల్లీలో నిరసన చేపట్టే ముందే దేశవ్యాప్త నిరసన చేపడతామని తెలిపారు. గడువులోగా సీఈసీ పదవి నుంచి వైదొలగకపోతే జంతర్ మంతర్ 2.0 కచ్చితంగా జరుగుతుందని హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.