Reading Time: < 1 minute

ఈసారి లక్షా 24 వేల వినాయక విగ్రహాల ఏర్పాటు: డీజీపీ సీవీ ఆనంద్

Caption of Image.

తెలంగాణలో ఈసారి (2026) లక్షా 24 వేల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 2026 సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్న  సందర్భంగా కీలక వివరాలను వెల్లడించారు. ఐసీసీసీ, డీజీపీ కార్యాలయం నుంచి నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 1,24,000 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇవి జియో ట్యాగింగ్, సంబంధిత పోర్టల్‌లో నమోదైన సమాచారం ఆధారంగా చెప్తున్న వివరాలుగా పేర్కొన్నారు.  ఇవన్నీ పబ్లిక్ ప్లేస్‌లలో ఏర్పాటు చేసిన విగ్రహాల వివరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. 

గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 8 వేల విగ్రహాలు అదనంగా ఏర్పాటు అయ్యాయని డీజీపీ తెలిపారు. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 88 వేల విగ్రహాలు నిమజ్జనం పూర్తయినట్లు వెల్లడించారు. ఒక్కరోజులోనే 6 వేల 350 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు చెప్పారు. ఇంకా సుమారు 25 వేల 500 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందన్నారు.  

మరోవైపు హైదరాబాద్ లో నిమజ్జనం కోలాహలం కొనసాగుతోంది. సిటీ నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ వైపు విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. నిమజ్జనోత్సవాలను చూసేందుకు రాత్రి సిటీ పబ్లిక్ భారీ ఎత్తున ట్యాంక్ బండ్ చేరుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.