Reading Time: < 1 minute

బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Caption of Image.

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ కొత్తగా కుటుంబాలు ఏర్పడినా, కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా, లక్షలాది మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. సివిల్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా తాను రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా,వేగవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 

2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16,32,810 కొత్త కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈనెల 27 హుజూర్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, మిర్యాలగూడలో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.