
బాలీవుడ్‌లో మళ్లీ హారర్ కామెడీ అండ్ థ్రిల్లర్ జోనర్‌కు డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది పెద్దగా ఆకట్టుకోలేదు ఈ జోనర్ చిత్రాలు. కానీ భూత్ బంగ్లా సక్సెస్‌తో మళ్లీ హోప్ ఇచ్చాడు అక్షయ్ కుమార్. దీంతో ఈ తరహా సినిమాలపై ఆలియా భట్ నుండి అజయ్ దేవగన్ వరకు కాన్సట్రేట్ చేస్తున్నారు. కోర్టు రూమ్ డ్రామాలకు బ్రేక్ ఇచ్చిన యామీ గౌతమ్ కూడా ఈ సారి కామెడీ సినిమా చేసేందుకు సిద్ధమైంది. హారర్ కామెడీ నయీ నవేలితో పలకరించబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఆలియా భట్ కూడా తొలిసారిగా ఈ జోనర్‌లోకి ఎంటరౌతోంది. 2018లో సంచలన విజయం సాధించిన తుంబడ్ సీక్వెల్లో భాగం కాబోతోంది. వచ్చే ఏడాది తుంబడ్2 రిలీజ్ కాబోతోంది.
హీరోయిన్స్ మాత్రమే కాదు… హీరోలు అజయ్ దేవగన్ అండ్ రాజ్ కుమార్ రావ్ కూడా హారర్ థ్రిల్లర్ స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అజయ్ గతంలో షైతాన్, భూత్ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాకు ‘సూర్య ప్రకాష్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు టాక్. బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాజ్ కుమార్ రావు కూడా ఓ హారర్ కామెడీ చేస్తున్నాడట. విషకన్య అనే హారర్ ఫాంటసీ ఫిల్మ్ తెరకెక్కిస్తోందట ధర్మ ప్రొడక్షన్స్. ‘లాపతా లేడీస్’ ఫేమ్ ప్రతిభా రత్న టైటిల్ రోల్ పోషించనుందట. ఈ రో చూస్తుంటే మళ్లీ హారర్ జోనర్‌పై కాన్సట్రేట్ చేస్తున్నట్లే ఉంది బాలీవుడ్.