
22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. GHMC, DTCP, HMDA అనుమతి ఉంటే 22A పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని ప్రకటించింది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 2026 సెప్టెంబర్ 24న చేసిన ఈ ప్రకటనతో చాలా మందికి ఉపశమనం కలగనుంది.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ,డీటీసీపీ వంటి చట్టబద్ధమైన ప్లానింగ్ అథారిటీల నుంచి అనుమతి పొందిన లేఅవుట్లు లేదా భవనాలు నిషేధిత జాబితాలో6 ఉన్నప్పటికీ వాటికి రిజిస్ట్రేషన్ కు అనుమతించనున్నట్లు ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని తక్షణమే అమలు చేయాల్సిందిగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీటీసీపీ, హెచ్ఎండీ అధికారులకు రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది.
22ఏ లో భూమి ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయినవారు ఉంటే.. డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ఓనర్షిప్ ను కూడా మార్పు చేసుకోవచ్చునని ఆదేశాల్లో పేర్కొంది.
ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి పరిధిలో ఉన్న అనేక కాలనీల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకోనుంది.