
Gulveer Singh: భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. 2026 ఆసియా క్రీడలలో పురుషుల 10,000 మీటర్ల ఫైనల్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ హోరాహోరీ రేసును ఆయన కేవలం 28:29.38 నిమిషాల టైమింగ్‌తో పూర్తి చేసి ట్రెండింగ్‌లో నిలిచారు.
గుల్వీర్ సక్సెస్ జర్నీ:
అంతర్జాతీయ వేదికలపై గుల్వీర్ సింగ్ తన పరుగుతో తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఈ తాజా గెలుపుతో ఆయన తన కెరీర్‌లో మరో భారీ అంతర్జాతీయ పతకాన్ని జమ చేసుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే, గతంలో 2023లో జరిగిన హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లోనూ అతడు కాంస్య పతకం సాధించి అదరగొట్టారు.
గుల్వీర్ సింగ్ పతకాలు:
ఇటీవలే ముగిసిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ గుల్వీర్ అదరగొట్టారు. అక్కడ 27:49.78 సమయంలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక రికార్డుల విషయానికి వస్తే.. 2025లో ఏకంగా 27:00.22 సమయంలో లక్ష్యాన్ని చేరుకుని జాతీయ 10,000 మీటర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. అంతకంటే ముందు గత ఏడాదే ఏషియన్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు. దీంతో ఆసియా ఖండంలోనే టాప్ డిస్టెన్స్ రన్నర్లలో ఒకరిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
ఇండియన్ అథ్లెటిక్స్ గర్వించదగ్గ స్టార్:
అంతర్జాతీయ గేమ్స్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుల్వీర్ సింగ్, ఈ ఆసియా క్రీడలలోనూ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేశారు. ఈ తాజా పోడియం ఫినిష్‌తో అతడు అంతర్జాతీయ వేదికలపై భారత్ కీర్తిని మరో మెట్టు ఎక్కించారు.
🥈 SILVER FOR GULVEER SINGH! 🇮🇳🔥
Men’s 10,000m | #AsianGames2026
⏱️ 28:29.38
25 laps of grit. Gulveer sat on the leader’s shoulder, stayed patient through the middle of the race and fought all the way to the line, just 1.87 seconds off gold 💪
He split Bahrain’s duo to finish… pic.twitter.com/FrKc7cGWmL— Athletics Federation of India (@afiindia) September 25, 2026