
కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన కార్తీక్ సుబ్బరాజ్ సక్సెస్ ట్రాక్ గాడి తప్పేసింది. గత ఏడాది గేమ్ ఛేంజర్‌కు స్టోరీ ఇచ్చి రామ్ చరణ్ ఇమేజ్ డ్యామేజ్‌కు కారణమయ్యాడు. సూర్యతో రెట్రో తీసి తమిళ తంబీల అసంతృప్తికి గురయ్యాడు. అందుకే ఈ సారి స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయ్యాడు. గేమ్ ఛేంజర్, రెట్రో సినిమాల రిజల్ట్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్‌ను పట్టించుకోవడం మానేశారు స్టార్స్. దీంతో డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి.. నిర్మాతగా ఏదో ప్రయత్నాలు చేశాడు కానీ అదీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ మెగా ఫోన్‌పై ఫోకస్ చేసి డోరతి మూవీని తెరకెక్కించాడు.
కీర్తి సురేష్ హీరోయిన్‌గా సనంద్, రిషికాంత్ లీడ్ రోల్స్‌లో నటించిన డోరతి సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి ఇళయ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది డోరతి. సుబ్బు, కార్తీ జీవితాల్లో డోరతి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో ఈ మూవీ ద్వారా చూపించబోతున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. అట్లీ, లోకేశ్ కనగరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ బన్నీని లైన్లో పెడుతుంటే.. కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం హీరోల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అప్పుడెప్పుడో ఇండిపెండెంట్ సినిమా తీస్తానని చివరకు డోరతి తెస్తున్నాడు. నెక్ట్స్ మలయాళ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తానని రీసెంట్లీ వెల్లడించాడు కార్తీక్. ఇవన్నీ సరే.. కార్తీక్ డోరతితో హిట్ కొట్టి.. మళ్లీ స్టార్ హీరోల అటెన్షన్ గ్రాబ్ చేస్తాడో లేదో..?