Reading Time: < 1 minute

కే ఎల్ హెచ్ లో అంతర్జాతీయ ఏఐ సదస్సు..హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు

Caption of Image.

చేవెళ్ల, వెలుగు: ఏఐ వినియోగంతో పారిశ్రామిక రంగంలో భద్రత, విశ్వసనీయతను పెంచడంపై కేఎల్‌‌ డీమ్డ్‌‌ టు బి యూనివర్సిటీ అజీజ్‌‌నగర్‌‌ క్యాంపస్‌‌(కేఎల్‌‌హెచ్‌‌)లో గురువారం అంతర్జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది. ఐఈఈఈ ఇంటర్నేషనల్‌‌ కాన్ఫరెన్స్‌‌ ఆన్‌‌ ఏఐ సెక్యూరిటీ ఫర్‌‌ ఇండస్ట్రియల్‌‌ ఐఓటీ సిస్టమ్స్‌‌ (ఏఐఎస్‌‌ఐఐఎస్‌‌–2026) పేరుతో ప్రిన్సిపల్‌‌ డాక్టర్‌‌ ఎ.రామకృష్ణ, డాక్టర్‌‌ మౌస్మి అజయ్‌‌ చౌరాసియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈ నెల 26 వరకు కొనసాగనుంది.

 తొలిరోజు స్పెయిన్‌‌లోని యూనివర్సిటీ ఆఫ్‌‌ విగోకు చెందిన జువాన్‌‌ జోస్‌‌ రోడ్రిగ్జ్‌‌–అండినా, జర్మనీలోని ఎస్‌‌ఏపీకి చెందిన స్టామటిస్‌‌ కర్నౌస్కోస్‌‌, నార్డకాడమీ యూనివర్సిటీకి చెందిన జాన్‌‌ హాస్‌‌, శ్రీలంకలోని ఏసీసీఎల్‌‌ఈఆర్‌‌కు చెందిన కవింగా ఉప్పుల్‌‌ ఏకనాయక, ఐఈఈఈ ఇండియా కౌన్సిల్‌‌ చైర్‌‌–ఎలెక్ట్‌‌ ప్రీతి బజాజ్‌‌, ఐఈఈఈ స్టూడెంట్‌‌ యాక్టివిటీస్‌‌ కమిటీ చైర్‌‌ ఆశిష్‌‌ సింఘాల్‌‌ పాల్గొన్నారు.

886 పరిశోధనా పత్రాలు..

ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 886 పరిశోధనా పత్రాలు రాగా, వాటిలో 187 పేపర్లను ఎంపిక చేశారు. వీటిలో 123 పేపర్లు ప్రదర్శనకు నమోదయ్యాయి. కేఎల్‌‌ డీమ్డ్‌‌ టు బి యూనివర్సిటీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ ఎర్‌‌. కోనేరు లక్ష్మణ్‌‌ హవీష్​ మాట్లాడుతూ.. ఏఐఎస్‌‌ఐఐఎస్‌‌–2026 ద్వారా అంతర్జాతీయ పరిశోధన, పరిశ్రమ రంగాల అనుభవాలు ఒకే వేదికపైకి వస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు సురక్షితమైన, ఆచరణాత్మక పరిష్కారాల అభివృద్ధికి ఈ చర్చలు ఉపయోగపడతాయని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.