Reading Time: < 1 minute

రూ. 45 కోట్లతో నిర్వాసితుల కాలనీలో మౌలిక వసతులు : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Caption of Image.

యాదాద్రి, వెలుగు : బస్వాపురం రిజర్వాయర్​ కోసం భూములిచ్చిన నిర్వాసితుల ఇండ్లకు రూ. 45 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్​​ అండ్​ ఆర్​ కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లకు మౌలిక వసతుల పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వసతుల కల్పనతో పాటు కాలనీలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. 

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ ఏర్పాటు చేయిస్తామన్నారు. కొత్తగా స్కూల్​ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సర్పంచ్​ ఎడ్ల వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్‌‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-,  లైబ్రరీ చైర్మన్ అవేస్ చిస్తి, పీఏసీఎస్​ చైర్మన్ పక్కిరి కొండల్ రెడ్డి  ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.