Reading Time: 2 minutes

2వేలు దాటితే MDR చార్జీలు: పేమెంట్స్ చేసే ముందే ఈ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్

Caption of Image.

 UPI ద్వారా పెద్ద మొత్తం బిల్లును ఒకేసారి కట్టకుండా, MDR ఛార్జీలు పడకుండా ఉండటానికి రూ.2 వేలు చొప్పున పదే పదే  కడుతున్నారా ? అయితే జాగ్రత్త! ఈ రకమైన చెల్లింపుల వల్ల మీ బ్యాంక్ అకౌంట్ లేదా UPI సేవలు తాత్కాలికంగా బ్లాక్ అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 అసలు MDR ఛార్జీలు ఏంటి
అక్టోబర్ 15 నుండి 2వేల కంటే ఎక్కువ  ఉన్న పర్సన్-టు-మర్చంట్ (P2M) UPI లావాదేవీలపై 0.4% MDR (Merchant Discount Rate) ఛార్జీ వర్తించనుంది. కానీ 2వేలలోపు  చేసే చెల్లింపులకు ఎలాంటి MDR చార్జెస్ ఉండవు. అందువల్ల, కొందరు రూ. 6 వేల  బిల్లును ఒకేసారి కట్టకుండా.. MDR చార్జెస్  తప్పించుకోవడానికి రూ. 2 వేల చొప్పున మూడుసార్లు UPI పేమెంట్స్  చేస్తున్నారు. సాంకేతికంగా ఇది సాధ్యమే అయిన, ఇలా చేయడం వల్ల కొన్ని కొత్త సమస్యలు కొనితెచ్చుకున్నట్లే.

బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ 
మీరు తక్కువ టైంలోనే ఒకే వ్యాపారికి (Merchant) పదేపదే రూ. 2వేల చొప్పున వరుసగా పేమెంట్లు చేస్తూ ఉంటే, బ్యాంకుల ఆటోమేటిక్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ (Fraud Monitoring System) అలెర్ట్ అవుతుంది. ఒకే మొత్తం లావాదేవీలు వరుసగా జరగడాన్ని బ్యాంక్ అనుమానాస్పద చర్యగా (Suspicious Activity) గుర్తించి, మీ UPI సేవలను లేదా ట్రాన్సాక్షన్లను తాత్కాలికంగా బ్లాక్ చేసే ప్రమాదం ఉంది.

 ప్రతి బ్యాంక్‌కు ప్రతిరోజు  ఉచిత ట్రాన్సక్షన్స్  పై ఒక లిమిట్ ఉంటుంది. ఒకే బిల్లును కొంచెం కొంచెం కట్టడం వల్ల మీ డైలీ లిమిట్  త్వరగా అయిపోతుంది. ఇంకా ఒకే బిల్లును విడివిడిగా కొంచెం కొంచెం కడతానంటే వ్యాపారి అంగీకరించాలనే నిబంధన ఏదీ లేదు. బిల్లింగ్, అకౌంటింగ్, రీఫండ్ ప్రాసెస్ లేదా ఆడిటింగ్ ఈజీగా ఉండటానికి ఒక ఇన్‌వాయిస్‌కు ఒకే పేమెంట్ మాత్రమే ఇవ్వాలని వ్యాపారి కస్టమర్‌ను కోరవచ్చు.

MDR ఛార్జీ కస్టమర్ కట్టాలా?
లేదు! MDR అనేది కేవలం వ్యాపారులు (Merchants) భరించాల్సిన ఖర్చు. కస్టమర్ల నుంచి UPI MDR పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ ఏదైనా షాపు యజమాని మీ నుండి MDR ఛార్జీలను డిమాండ్ చేస్తే, మీరు మీ UPI యాప్ ద్వారా లేదా బ్యాంక్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలు:
*2వేలు దాటిన P2M UPI పేమెంట్లకు  0.4% MDR వర్తిస్తుంది.
*6 వేలు బిల్లును రూ.2 వేలు చొప్పున 3 సార్లు కడితే ఛార్జీ పడదు కానీ, దాని వల్ల కొంత సమస్య ఉంది.
*ఒకే వ్యాపారికి వరుసగా ఒకే మొత్తం పంపితే బ్యాంక్ సెక్యూరిటీ అలర్ట్ అవ్వచ్చు.
*దింతో అనుమానాస్పద లావాదేవీగా గుర్తించి UPI సేవలు తాత్కాలికంగా ఆపివేయవచ్చు.
*లెక్కలు సరిగా ఉండటానికి వ్యాపారి ఒకే బిల్లుకు ఒకే పేమెంట్ కోరవచ్చు.
*మొత్తంగా MDR  అనేది వ్యాపారి కట్టాలి, కస్టమర్‌పై ఆ భారం వేయకూడదు.

 MDR తప్పించుకోవడానికి పదేపదే పేమెంట్స్ కొంచెం కొంచెం మొత్తంలో కట్టే పద్ధతి ఎక్కువైతే.. భవిష్యత్తులో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీనిపై కఠినమైన డైలీ లిమిట్స్ లేదా కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది.
 

©️ VIL Media Pvt Ltd.