
వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ స్నేహా మెహ్రా. గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవను.. అడ్డుకున్న.. ఆపబోయిన కానిస్టేబుల్ నర్సింలుపై కత్తితో దాడి చేయటాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఎస్పీ. పోలీసులపై దాడులు చేస్తే సహించేది లేదని.. తాట తీస్తాం అని వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ. కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామని.. అతని పేరు తరుణ్ అని స్పష్టం చేశారు ఎస్పీ.
గొడవను అడ్డుకోబోయిన కానిస్టేబుల్ నర్సింలుపై దాడి చేసిన తరుణ్ పై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని.. కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని అతని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఎస్పీ స్నేహా మెహ్రా. వినాయక నిమజ్జనం ఊరేగింపునకు కత్తితో ఎందుకు వచ్చాడు.. కత్తి ఎందుకు తీసుకొచ్చాడు అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసిన ఎస్పీ.. కానిస్టేబుల్ పై దాడి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందా లేదా అనేది విచారణలో తేలుస్తామని వెల్లడించారు ఎస్పీ.
హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ నర్సింలును పరామర్శించి.. అతని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు ఎస్పీ.