Reading Time: < 1 minute

త్వరలో పాదయాత్ర స్టార్ట్ చేస్తా… ఫస్ట్ మీటింగ్ జోగులాంబ గద్వాల జిల్లాలో : కవిత 

Caption of Image.

టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కవిత త్వరలోనే పాదయాత్ర చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. శనివారం ( సెప్టెంబర్ 26 ) మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎండాకాలంలో పాదయాత్ర స్టార్ట్ చేస్తానని.. మొదటి మీటింగ్ జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహిస్తానని తెలిపారు కవిత. పాదయాత్రలో తన బస కోసం వాడబోయే బస్సు పేరు భైరవ అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ టీమ్ కావాలనే తనను ట్రోల్ చేస్తున్నారని.. వాళ్ళని లైట్ తీసుకున్నానని అన్నారు కవిత. పవన్ కళ్యాణ్ తెలంగాణపై మాట్లాడితేనే మాట్లాడానని అన్నారు. రాష్ట్రం రాగానే బీఆర్ఎస్ పార్టీలో కొందరు తనను తిరగకుండా ఆపారని.. బతుకమ్మ కూడా సరిగా ఆడనివ్వలేదని అన్నారు.తమ పార్టీ తరపున 2027లో దసరాకి బతుకమ్మకు గిన్నిస్ రికార్డ్ చేస్తామని అన్నారు కవిత.

ALSO READ : దానం నాగేందర్పై పోటీకి సై..

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు కవిత. ఖైరతాబాద్ ఉపఎన్నికలో వంద శాతం పోటీ చేస్తామని, అభ్యర్థి ఎవరు ఏంటనేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అయితదని ఆమె విమర్శించారు.

©️ VIL Media Pvt Ltd.