Reading Time: < 1 minute
Bjp Sudhanshu Trivedi Rahul Gandhi Vote Chori Anti Incumbency Sir Row

BJP: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) వివాదం నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను దోశద్రోహిగా అభివర్ణిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ వల్లే బీజేపీ గెలుస్తోందని అన్నారు. ఇందిరాగాంధీ లాంటి వారు ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొని ఓడిపోయారని, కానీ మోడీ, అమిత్ షా, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు? అని ప్రశ్నించారు.

అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మరోసారి ఒక పీపీటీని ప్రదర్శించారు, అది సాధారణంగా ఎవరికీ తెలియదని, అనుమానాస్పద, అజ్ఞాత సమాచారం నుంచి వస్తుందని అన్నారు.

‘‘ఆయనకు భారత రాజకీయాలపై అసలు అవగాహనల లేదు. 967 నుంచి తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పుడు బీజేపీ ఉనికిలో లేదు. బెంగాల్‌లో 1977 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. బీహార్‌లో 1990 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. యూపీలో 1989 నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు. ఒడిశాలో 1999 నుంచి కాంగ్రెస్ అధికారంలో లేదు. రాహుల్ గాంధీకి దీనిపై అవగాహన లేదు… పారదర్శక ఎన్నికలు జరిగి, సీసీటీవీ కెమెరాలు వచ్చి, స్వతంత్ర మీడియా వచ్చాక, వారికి అధికారంలోకి రావడం కష్టంగా మారింది’’ అని సుధాన్షు త్రివేది అన్నారు.