Reading Time: < 1 minute

SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె టైంలో ఏటీఎం ఛార్జీలు ఉండవ్

Caption of Image.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఇది బిగ్ రిలీఫ్.. ఏటీఎం ఛార్జీలపై కీలక ప్రకటన చేసింది ఎస్బీఐ.  యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చిన బ్యాంకు సమ్మె టైంలో ఎస్ బీఐ తన కస్టమర్లకోసం ఏటీఎం యూజర్ ఛార్జీలను మినహాయించింది. మూడు రోజుల సమ్మె కాలంలో దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించబోమని స్పష్టం చేసింది. 

సెప్టెంబర్ 28 నుంచి30 వరకు జరిగే మూడు రోజుల సమ్మె కాలంలో, ఎస్బీఐ కస్టమర్లు దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా ఎన్నిసార్లైనా ఉచితంగా నగదు విత్‌డ్రా , బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.  సాధారణంగా ఉండే ఉచిత నెలవారీ ఏటీఎం లావాదేవీల పరిమితి దాటినప్పటికీ, ఈ మూడు రోజులు ఎలాంటి అదనపు యూజర్ ఛార్జీలు లేదా జీఎస్టీ (GST)అదనపు యూజర్ ఛార్జీలు లేదా జీఎస్టీ (GST) విధించబడని బ్యాంకు స్పష్టం చేసింది. 

©️ VIL Media Pvt Ltd.