Reading Time: < 1 minute

ఐలమ్మ జయంతి వేడుకలకు తరలిరండి: బీసీ రాజ్యాధికార సమితి

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌లోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం సమీపంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాం నిరంకుశ పాలన, దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా  ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని దాసు సురేష్ అన్నారు.

సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, యువజన, మహిళా నాయకులు పాల్గొని ఐలమ్మకు నివాళులర్పిస్తారన్నారు.

©️ VIL Media Pvt Ltd.